Search This Blog

Chodavaramnet Followers

Friday, 16 September 2016

KIDS AGE - DIFFERENCE - TELUGU JOKES COLLECTION

పిల్లలు వయసులు!
.
"అమ్మా....ఈ పిల్లల వయస్సు ఎంత?" అడిగాడు బస్ కండక్టర్!!
" ఈ చిన్నోడి వయసు..2 సం.లు ,
రెండొవాడిది....2.5 సం.లు ....
ఇహ ఆ మూడొ వాడి వయస్సు .....
అదే... 3 సం.లు వుండొచ్చు!!" అంది "సత్తెమ్మ"
"చూడమ్మా...నువ్వు టికెట్టు తీసుకోక పోయినా పర్లేదు...
కానీ మరీ నా చెవులో పువ్వెట్టకు.....
ఇక నుండి ...
పిల్లల వయసులో.........
కనీసం 9 నెలలల తేడా అయినా ఉండేలా చెప్పు!!" అన్నాడు కండుక్టర్!!
"ఏటీ....??....నానేమైనా అపద్దం సెప్పాననుకుంటున్నావా ........
దొంగ సచ్చినోడా....
మిగతా ఇద్దరూ, నా పిల్లలు కాదు...
మా ఆడబిడ్డ ల పిల్లలు"అంది కోపం గా "సత్తెమ్మ"