Search This Blog

Chodavaramnet Followers

Monday, 12 September 2016

BOPPAYA FRUIT PROTECTS FROM INFECTIONS - BURN PROBLEMS - GIVES GOOD SLEEP ETC


భళారే... బొప్పాయి..!

కాలంతో పనిలేకుండా వచ్చే బొప్పాయి పండులో పోషకవిలువలే కాదు, వ్యాధుల్ని నియంత్రించే గుణాలూ ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇందులోని జియాక్సాంథిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌వల్ల వృద్ధాప్యంలో కంటికండరాలు బలహీనం కాకుండా ఉంటాయి. అలాగే ఆస్తమా పెరగకుండా ఉంటుంది.

* బీటా కెరోటిన్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కారణంగా బొప్పాయి ఎక్కువగా తీసుకునేవాళ్లలో పేగుక్యాన్సర్‌ రాదట. పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నూ నిరోధిస్తుందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగం పేర్కొంటోంది.

* ఎముక ఆరోగ్యానికి దోహదపడే కె-విటమిన్‌ కూడా సమృద్ధిగా దొరుకుతుంది.

* మధుమేహుల్లో చక్కెర శాతం పెరగకుండా ఉండేందుకు పీచుపదార్థం ఎంతో అవసరం. బొప్పాయిలో అది సమృద్ధిగా ఉంటుంది.

* బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది. పొటాషియం, పీచూ ఎక్కువగా ఉండటంవల్ల హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.

* బొప్పాయిలోని కోలీన్‌ నిద్ర పట్టడానికీ కండరాల కదలికలకీ అధ్యయనం, జ్ఞాపకశక్తులను పెంచడానికీ దోహదపడుతుంది. అంతేకాదు, ఇది కొవ్వుని గ్రహించి మంటలని తగ్గిస్తుంది.

* కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉండే ఈ పండ్ల గుజ్జుని ఇన్ఫెక్షన్‌ చేరిన పుండ్లూ కాలిన గాయాలమీద పెట్టడంవల్ల అవి త్వరగా తగ్గుతాయట.