Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 August 2016

HOW TO GET INSTANT ENERGY AND RELIEF FROM JOB TENSION


చిన్న పనికే అలసిపోతుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి…

- చిన్న పనికే అలసిపోతుంటే శరీరంలో శక్తిస్థాయిలు తగ్గిపోతున్నాయని గమనించాలి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఎంతో ఉల్లాసాన్ని కూడా కల్గిస్తుంది. ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడంతో రోజు మొదలవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ప్రోటిన్స్‌ ఉన్న సోయాసాస్‌, గుడ్లు, పాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

- ఉదయాన్నే వచ్చే సూర్య కిరణాలు శరీరంపై పడే విధంగా పది నిమిషాలు ఎండలో ఉండటం మంచిది. సూర్య కిరణాలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి, దాంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్‌ 'డి' కూడా అందుతుంది. రోజు తినే ఆహారంతో పాటు, స్నాక్స్‌ కూడా తీసుకుంటే మంచిది. స్నాక్స్‌లో ఆయిలీ ఫుడ్‌కు బదులుగా ఫ్రూట్స్‌, జ్యూస్‌, ఉడకబెట్టిన గింజలు తీసుకోవాలి. ఇది తాత్కాలికంగా శరీరానికి ఉపశమనం కల్గిస్తుంది.

- రోజూ మధ్యాహ్నం పూట పావు గంట నిద్రపోతే ఒత్తిడి మాయమైపోతుంది. ఆఫీసుల్లో పని చేస్తున్నప్పుడు తొందరగా ఒత్తిడికి గురవుతుంటే పది నిమిషాలు లేచి అటు ఇటు నెమ్మదిగా నడవటం మంచిది. శరీరానికి అవసరమైనంత నీరు అందకుంటే డిహైడ్రేట్‌ అవుతుంది. ఇది ఒకరకమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఎక్కడున్నా ఒక వాటర్‌ బాటిల్‌ను వెంట ఉంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.