Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 July 2016

STOP FEVER IN JUST FEW MINUTES WITH NATURAL KITCHEN ITEMS


జ్వరాన్ని చిటికెలో తగ్గించుకోండిలా…

వర్షాకాలం అనారోగ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. .జలుబు, ఆపై జ్వరం త్వరగా వచ్చేస్తుంది. కొందరికి కాస్త జ్వరముంటేనే టాబ్లెట్లపై, టాబ్లెట్లు వేసేస్తుంటారు. ఇది అతి ప్రమాదకరం. మహిళలైతే మరింత ఇబ్బంది. సాధారణ జ్వరాన్ని కొన్ని సూచలు పాటిస్తే వెంటనే తగ్గించుకొనే అవకాశం ఉంది. వాటిని చూద్దాం..

* జ్వరం వస్తే కొద్దిపాటి పసుపును గోరువెచ్చని నీరు లేదా పాలలో కలుపుకొని తాగాలి.

* జ్వరం వస్తే తులసి ఆకులను బాగా నమలటం లేదా ఆకులను దంచి నుదురు, ఛాతీలపై ఉంచాలి. తేనెలో కలిపి తాగొచ్చు.

* అల్లం ముక్కను వేడి నీళ్లలో వేసి తాగితే ఫలితం ఉంటుంది.

* ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ ఆవాలు వేసి 5 నిముషాలు అయ్యాక త్రాగాలి.

* తులసి ఆకులు, మిరియాలు బాగా నూరి ఆ కషాయాన్ని త్రాగాలి.

* జ్వరం బారిన పడ్డవారు కొద్ది మోతాదుల్లో తరచుగా అంటే కనీసం రెండు గంటలకొకసారి ఏదైనా ఆహారం ,ద్రవాహారం తీసుకోవటం మంచిది.

* జీలకర్ర, ధనియాలు, వాము ఈ మూడింటినీ సరైన మొతాదులో తీసుకొని కషాయంలా చేసుకొని తాగినా జ్వరం తగ్గుతుంది.

* కొద్దిగా బెల్లం, శొంటిని మొత్తగా నూరి తేనెలో కలుపుకొని తాగితే జ్వరం సమయంలో ఉండే వికారం, పైత్యం తగ్గిపోతుంది.

* జ్వరం ఉన్న వారు గంటకోమారు ద్రవరూపంలో ఆహారాన్ని తీసుకొంటే త్వరగా కోలుకోవచ్చు.