రొయ్యలతో మంచి స్నాక్ ఐటెం
రొయ్యలు మరియు సీ ఫుడ్స్ లో మంచి క్వాలిటీ ప్రోటీన్ , మినరల్స్ , ఒమేగా-త్రీ ఫ్యాటి ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి , గుండె ఆరోగ్యానికి , శరీర కండర సామర్ధ్యానికి మేలు చేస్తాయి. వారంలో రెండు సార్లు సీ ఫుడ్స్ డైట్ లో చేర్చుకొంటే మంచిది. రెడ్ మీట్, చికెన్ తో పోలిస్తే సీ ఫుడ్స్ తొందరగా జీర్ణం అవుతాయి.
1) ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఒక బాగా వలిచి శుభ్రం చేసిన ఒక కప్పు రొయ్యలు , ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం , వెల్లుల్లి ముక్కలు , ఒక స్పూన్ జీలకర్ర, చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు , చిటికెడు మిరియాల పొడి వేసి రొయ్యలను బాగా ఉడికించాలి.
2) రొయ్యలను బాగా ఉడికిన తర్వాత మిగతా వాటర్ వంచేసి... పక్కన పెట్టుకోండి.
3) ఇప్పుడు ఒక పాన్ లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనె వేసి రొయ్యలను కొంచెం ఫ్రై చేసి, దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి , జీరా పొడి , టేస్ట్ కి సరిపడా సాల్ట్ , మీ ఇష్టానికి తగినంత కారం వేసి ఒక రెండు నిముషాలు ఫ్రై చేయాలి.
4) చివరిగా పుదీనా , నిమ్మకాయ తో గార్నిష్ చేసి రోటీ తో సర్వ్ చేసుకొని తింటే కమ్మటి అనుభూతి కలుగుతుంది. ఎదిగే పిల్లలకి మంచి ఆరోగ్యమైన వంటకం ఇది.