Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 July 2016

HUMOROUS JOKES COLLECTION

వంట పనుల్లో
భర్త : సీతా నువ్వు నాలో సగభాగం .
వైఫ్ : ఐతే మీ జీతంలో సగం నాకు ఇచ్చి ...నా వంట పనుల్లో సగభాగం మీరు చెయ్యండే .

నాన్న వయసు
టీచర్ : మీ నాన్న వయసెంత ?
చింటు : నాకు ఎంతో తనకు అంతే .
టీచర్ : అదేంటి ?
చింటు : నేను పుట్టినప్పుడే కదా తను నాన్న అయ్యాడు .

తాళం చెవి
*
అర్ధరాత్రి రెండు గంటలకు, డాక్టర్ పద్మనాభం ఇంటి సింహద్వారంను ఎవరో దబదబా కొడుతున్నారు. ఆవలిస్తూ తలుపు తీసాడు ఆయన. ఎదురుగా .............
" సార్! మాఅబ్బాయి మా ఇంటి తాళం చెవి మింగేసాడు.దాన్నిఎట్టాగైనా బయటకు తెప్పించండి" అన్నాడు ఓ పెద్దమనిషి తన కొడుకుని చూపిస్తూ బాధగా .
" ఎప్పుడు మింగేసాడు " అడిగాడు డాక్టర్
" ఓ పదిరోజుల క్రితం "
" అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకొచ్చావేమిటి ? " కంగారు పడ్డాడు డాక్టర్ .
" రెండో తాళం చెవి పోయింది ఇవాళే , అందుకే ... " నసిగాడు పెద్ద మనిషి

మంచి మందులు
పేషెంట్ తో డాక్టర్ : నాకు జ్వరం ,దగ్గు ,తలనొప్పి ఉన్నాయి మంచి మందులు ఏమైనా ఉంటే ఇవ్వండి .
డాక్టర్ : మంచి మందులు అంటూ ఏమి ఉండవు , మా మెడికల్ షాప్ లో ఏవి స్టాక్ ఉంటే ఆ మందులే రాస్తారు

పొగడనక్కర్లేదన్నమాట
కొత్త గా పెళ్లి అయిన ప్రేమికుల జంటలో రమ్య ఇలా అంది : " ఇక మన పెళ్లి అయింది కాబట్టి మీకో విషయం చెప్పాలి !...నాకు అబద్ధాలు అంటే అసలు పడవు ...కాబట్టి మీరు ఇక అబద్ధాలు ఆడితే ఊరుకోను !"
హస్బెండ్ : " అయితే ఇక నుంచి నిన్ను రంబా , ఊర్వసి అంటూ పొగడనక్కర్లేదన్నమాట !!"

ఇండియామ్యాప్
రమేష్ : " అరే ! నేను నీరు లేని నదులు ,మట్టిలేని నేల, జనం లేని నగరాలు చూశాను తెలుసా ?"
రమ్య : "అరే ...! ఎక్కడ ?"
"రమేష్ : ఇండియా మ్యాప్ లో ....!

కల
అప్పారావు : తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయా ?
పుల్లా రావు : ఓ తప్పని సరిగా జరిగి తీరుతాయి .ఇంతకీ నీకెందుకు వచ్చింది ఆ అనుమానం .
అప్పారావు : మరేమీలేదు . ఈ రోజు తెల్లవారుజామున నా భార్య " కరాటే " నేర్చుకున్నట్లు కల వచ్చిందిలే.

THANKS TO SRI VINJAMURI VENKATA APPARAO GARU 
FOR HIS EXCELLENT JOKES