రోజంతా చురుగ్గా ఉండాలన్నా, జుట్టూ, గోళ్లూ వంటివి ఆరోగ్యంగా పెరగాలన్నా ఆహారంలో మాంసకృత్తుల పాత్రే కీలకం. అందుకోసం ఈ పదార్థాలు తీసుకోండి.
* సెనగలు:
వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి.
* పప్పుధాన్యాలు:
ప్రతిరోజూ ఏదో ఒక పప్పును పిల్లలకు తినిపించాలి. కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి.
* సోయా:
మాంసాహారానికి దీటైన ప్రత్యామ్నాయంగా చెప్పే సోయాలో ప్రొటీన్‌శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది.
* పెరుగు:
ఇది మాంసకృత్తుల్నే కాదు, శరీరానికి మేలుచేసే.. ప్రొబయోటిక్స్‌నీ అందిస్తుంది. చిన్న కప్పు పెరుగు తీసుకున్నా కూడా పది నుంచి పన్నెండు గ్రాముల మాంసకృత్తులు శరీరానికి అందుతాయి.
• కప్పు పాలకూర చాలు!
* పాలకూర:
కప్పు పాలకూర సగం గుడ్డుతో సమానం అంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే కప్పు పాలకూర నుంచి ఏడు నుంచి పది గ్రాముల మాంసకృత్తులను పొందవచ్చు.