Search This Blog

Chodavaramnet Followers

Thursday, 21 July 2016

AASHADAMASAM GORINTAKU - HEALTH SECRETS


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

1. ఆషాఢం గోరింటాకు
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగువారి సంప్రదాయం. ఆషాఢ మాసం వచ్చిందంటే అరచేతుల్లో కెంపులు పొదిగినట్లు, మందారం పూసినట్లు మనోహరంగా పరుచుకుంటుంది గోరింటాకు. ఈ సంప్రదాయం వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి.

2. గోరింటాకే ఎందుకు?
గోరింటాకు కేవలం అందం కోసమేకాదు అనేక వ్యాధులను నయం చేయడానికి కూడా ఆయుర్వేదం లో విరివిగా వాడతారు. మధుమేహానికి, స్త్రీలలో తరచూ కలిగే ఋతుసమస్యలకు,కేశ సమస్యలకు, చర్మ సమస్యలకు గోరింట చక్కని పరిష్కారం. గోరింటాకులోని నేన్నోటెనిక్ ఆమ్లం చర్మంపైనున్న వ్యాధికారక క్రిములను నాశనం చేస్తుంది. చర్మం పైపొరలో ఉండే కెరటిన్ తో కలిసి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. అంతేకాదు హానికారక బాక్టీరియా నుండీ రక్షిస్తుంది. అందుకే గోరింటాకును తరచూ పెట్టుకుంటూ ఉంటారు.

సహజంగా లభించే ఆకువలన మాత్రమే ఆరోగ్యం చేకూరుతుంది. రసాయనాలు కలిపిన రంగు మెహెందీలవల్ల చర్మ రోగాలు, చర్మ సంబంధ కాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కనుక సహజమైన గోరింటాకునే ఉపయోగించాలి.
3. ఆషాఢమాసం లో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోడానికి గల కారణం
ఆషాఢ మాసం లో వాతావరణ లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల శరీరం అనారోగ్యానికి గురౌతుంది. వాతావరణం తేమగా ఉండటం, పైగా ఇంటిపనుల వల్ల చర్మం ఎక్కువగా నీటిలో నాని చర్మరోగాలకు దారి తీయవచ్చు. పుండ్లు పడటం, చర్మం, గోళ్ళు బీటలు రావటం జరగవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వీటిని నివారించి చర్మాన్ని, గోళ్ళను కాపాడటానికి గోరింటాకు పెట్టుకుంటారు. శరీరం లోని అధిక వేడిని కూడా గోరింటాకు అదుపు చేస్తుంది. ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలనే పెద్దల మాట వెనుక ఇంతటి ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి.