పండ్లలో రారాజు మామిడి పండు.
విటమిన A,C,E , amino acids, లు పుస్కలము గా ఉంటాయి .
రక్తపోటు బాధితులకు అవసరమయిన 'పొటాసియం ' ఎక్కువ గా ఉంటుంది .
పీచు పదార్ధము అధికం గా ఉన్నందున విరోచనం సాఫీగా అవుతుంది .ఎక్కువగా తింటే ఉడుకు విరోచనాలుపట్టుకుంటాయి .
మామిడి పండు రసం వీర్య వృద్ధి ని కలిగిస్తుంది ,
పాల తో కలిపి తీసుకుంటే బలాన్నిస్తుంది .
రక్తం లో కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది ,
చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ,
మామిడి రసం వల్ల విరేచనాలవుతాయనుకోవడం అపోహ! మామిడి పండులో ప్రేవులపైన దుష్ప్రభావం చూపే అంశాలేమీ లేవు. అయితే ఒక్కోసారి మామిడి పండ్లు విష పదార్థాలతో కలుతమయ్యే అవకాశం ఉంది. మాగేసేటప్పుడు గాని, రసం తినేటప్పుడు గాని ఇలా జరిగేందుకు వీలుంది. ఇలాంటి కలుషిత పదార్థాలవల్ల గాని, సూక్ష్మక్రిముల వల్ల గాని సాధారణంగా విరేచనాలవుతుంటాయి.
* మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతమందికి ‘సెగ గడ్డలు’ వస్తుంటాయి. శరీరంలో దాగివున్న ‘వేడి’ని బయటకు తెచ్చే గుణం మామిడికి ఉండటాన ఇలా జరుగుతుంది. వేడి శరీర తత్వం ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా తినడం మంచిది. సోరియాసిస్ గాని, ఇతర చర్మవ్యాధులు గాని ఉన్నవారు, ప్రేవుల్లో అల్సర్లు ఉన్నవారూ మామిడిని తినడం మంచిది కాదు. అలాగే మధుమేహ వ్యాధి నియంత్రణలో లేనివారు కూడా.