Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

HUMOROUS JOKES BY SRI Vinjamuri Venkata Apparao GARU

చెప్పినవాళ్ళే!
టీచర్ : 'నారు పోసిన వాడే నీరు పోస్తాడు ' అన్నట్లు మరో సొంత వాక్యం చెప్పరా గోపీ!
గోపీ : 'పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాస్తారు ...! టీచర్ ...
టీచర్ : ఆ .....!

***

నువ్వే తీసుకో…స్వీడన్ జోకు:
కిక్ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.
పక్కనే ఉన్న ఆ పొలం యజమాని
“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.
“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.
అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.
“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”
ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.
ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని
“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.
రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.

***

అర్ధ రూపాయి
భిక్షగాడు : గుడ్డి వాణ్ణి ఓ రూపాయి దానం చేయండమ్మ !
వ్యక్తి : నువ్వు గుడ్డివాడివేంటి ? నీకు ఒక కన్ను బాగానే ఉందే ?
భిక్షగాడు: అయితే అర్ధ రూపాయి దానం చేయండి అమ్మా . 
వ్యక్తి:ఆ !!

***

మూడు వరాలు
ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నీకు మూడు వరాలిస్తాను” అన్నది. ఆమె అలాగే విడిపించింది.
తర్వాత “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది” అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి”:-)

***