Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

HEALTHY ARTICLE ABOUT OBESITY


స్తౌల్య రోగం (Obesity ) 

శరీరం నందు కొవ్వు పెరగడానికి గల కారణాలు -

* దేహపరిశ్రమ లేని సుఖజీవనానికి అలవాటు పడటం. 

* కొవ్వును పెంచే తీపి, జిగట, నూనె పదార్దాలుని ఎక్కువ తినడం .

* అతిగా మాంసాహారం భుజించడం .

* పగటిపూట అతిగా నిద్రించడం .

* వీటివల్ల పెరిగే కొవ్వు శరీరంలో ని రసము, రక్తము మొదలయిన 7 ధాతువు మార్గాలకి అడ్డం పడటం వలన ఆహారం ధాతువులుగా మారే అవకాశం లేక కేవలం కొవ్వుగా పెరుగుతుంటుంది. దానివల్ల మనిషి ఏ చిన్న పని కూడా చేయలేని అసమర్దుడిగా అనారోగ్య పీడితుడు గా తయారవుతాడు.

కొవ్వు పెరగడం వలన అనర్ధాలు -

* ఎంత శ్వాస పీల్చినా సరిపోక వెంట వెంటనే శ్వాస పీల్చడం.

* నిద్రలో గురక రావడం .

* ఉబ్బసం, అతిదాహం , మేహా రోగాలు , మేహా వ్రణాలు , మూత్రరోగాలు , కుష్టు రోగాలు , జ్వరాలు రావడం.

* శరీరంలోని మోకాళ్ళు , నడుములు తుంటి , భుజాలు , మెడ మొదలయిన సందుల్లో వాతం చేరి వాతరోగాలు పుట్టడం.

* నరాల పటుత్వం తగ్గి సంభోగ శక్తి క్షీణించడం . 

స్తౌల్య రోగముని (Obesity ) హరించే ఔషధాలు - 2.

* శొంటి , మిరియాలు, పిప్పిళ్ళు , కరక్కాయ బెరడు , ఉశిరిక బెరడు, తానికాయ బెరడు ఇవన్ని సమభాగాలుగా తెచ్చి దోరగా వేయించి చిత్రమూలం , జీలకర్ర, పొంగించిన ఇంగువ ఈ మూడు పైన చెప్పిన దినుసులు లాగానే సమభాగాలుగా తీసుకుని అన్ని కలిపి మెత్తటి చూర్ణంగా తీసుకోవాలి . ప్రతిరోజు ఉదయమే రెండున్నర గ్రాముల చూర్ణం లో ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి . క్రమంగా అతికోవ్వు హరించి శరీరం సహజ స్తితికి వస్తుంది.

* ఎప్పుడు మంచినీరు తాగిన అరగ్లాస్ కంటే ఎక్కువ తాగకుండా తాగినప్పుడల్లా అరగ్లాస్ మంచినీళ్ళు గోరువెచ్చగా ఉండి అందులో 20 గ్రా తేనె కలిపి తాగుతూ ఉంటే రెండు మూడు నెలల్లో స్థూల శరీరం తగ్గి నాజూకుగా మారతారు.


* తగరం ( tin ) తో ఉంగరం చేయించి వేలికి తొడుక్కొని ఉంచుకుంటే కొవ్వు తగ్గిపోతుంది.

* దోరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం రెండున్నర గ్రాములు అందులో సమంగా తేనే కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే స్తూల శరీరం తగ్గిపోతుంది .

కొవ్వు తగ్గటానికి తీసుకోవలిసిన జాగ్రత్తలు -

* శరీరానికి ఏదో విధమైన శ్రమ , వ్యాయమం తప్పనిసరిగా ఉండాలి.

* వంటికి నువ్వులనూనె లేక ఆవనూనేతో నలుగు పెట్టుకోవాలి.

* కొర్రలు, జొన్నలు, రాగులు, యవలు , ఉలవలు, శనగలు, పెసలు, కందులు, కారము, చేదు , వగరు పదార్దాలు సేవించాలి .

* వేయించిన వంకాయలు , త్రిఫలా చూర్ణం , తెల్ల ఆవాల నూనె , ఆకుకూరలు , వేడినీరు మొదలైనవి ఉపయోగించాలి.

* పగటినిద్ర అస్సలు పనికి రాదు.

* గేదేనేయ్యి , తీపి పదార్దాలు , పిండిపదార్ధాలు పూర్తిగా నిషేధించాలి.

* చేదు పదార్దాలు తీసుకుంటూ ఉంటే వళ్లు సన్నబడుతుంది .