Search This Blog

Chodavaramnet Followers

Thursday 14 April 2016

SKIN CARE WITH DAILY EXERCISES - TIPS FOR PROTECTION OF SKIN IN TELUGU


వ్యాయామం తరవాత చర్మసంరక్షణ

వ్యాయామానికి ముందూ ఆ తరవాత తీసుకోవాల్సిన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, చర్మసంరక్ష విషయంలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలి. ఔను! అరగంట నుంచి గంటవరకూ కష్టపడి ఒళ్లంతా చెమటలు పట్టేలా వ్యాయామం చేశాక.. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే , పాటించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. లేదంటే మురికి పేరుకుని చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.
మృతకణాలు తొలగించాలనే ఉద్దేశంతో చాలామంది వ్యాయామం చేశాక గాఢత ఎక్కువగా ఉన్న స్క్రబ్‌ని వాడుతుంటారు. అది సరైన పనికాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల మృతకణాలు తొలగి పోవడం మాట ఎలా ఉన్నా, చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారుతుంది. ఇదే కొనసాగితే క్రమంగా మొటిమలు మొదలవుతాయి. అందుకే చర్మానికి పట్టిన చెమటను తొలగించేందుకు గాఢత తక్కువగా ఉన్న క్లెన్సర్‌ వాడాల్సిందే. లాక్టిక్‌ యాసిడ్‌ ఉన్న క్లెన్సర్‌ని ఎంచుకుంటే మరీ మంచిది. వ్యాయామం ముగించి ఇంటికి రాగానే ఈ పని చేయాలి. తాత్సారం చేస్తే చర్మగ్రంథులు చెమటతో, మురికితో మూసుకుపోతాయి.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. అప్పుడే ముఖం తాజాగా, తేమగా కనిపిస్తుంది. అయితే మాయిశ్చరైజర్‌ కూడా ఏది పడితే అది కాకుండా నాణ్యమైనదీ, చర్మతత్వానికి సరిపోయేలా ఉన్నదానినే ఎంచుకోవాలి.

* జిమ్‌లో వ్యాయామైనా... యోగా చేసినా.. వేగంగా నడిచినా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అలాంటప్పుడు వెంటనే నీళ్లు తాగాలని చూడకండి. కొంతసేపు విరామం ఇచ్చాకే తాగాలి. వేడి వాతావరణంలో చర్మం తేమను కోల్పోతుంది. ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చాక చర్మం దాన్నుంచి కోలుకుంటుంది. ఆ తరవాతే మీరు మంచినీళ్లు తాగాలి.