ఆమవాతం - RHEUMATSAM .
ఆమవాతం ఏర్పడటానికి గల కారణాలు -
ప్రకృతి విరుద్దం అయిన జీవన విధానం వలన మానవ శరీరాలలో వాతం, పిత్తం , కఫం అనే మూడు దోషాలు ప్రకోపిస్తాయి . ఈ దోషాల ప్రకోపం వలన కడుపులో అగ్నిమాన్ధ్యం ఏర్పడి తిన్న ఆహారం జీర్ణం కాక మురిగిపోయే పదార్థాన్ని ఆమం అంటారు. ఈ విధంగా ఆమాశయంలో పుట్టిన ఆమం సిరలలో దూరి శరీరం అంతా వ్యాపించి పోయి నొప్పులు కలిగిస్తుంది. శరీరంలోని అన్ని జాయింట్లలో చేరి నొప్పులు కలిగిస్తుంది. నొప్పులతో పాటు వాపులు కలిగిస్తాయి.
ఆమవాతం వలన కలిగే ఉపద్రవాలు -
ఆమవాతం ప్రకోపించినప్పుడు అది అన్ని వ్యాధులకు కష్టసాధ్యం అవుతుంది. చేతులు , కాళ్లు , శిరస్సు , చీలమండలు , పిరుదులు , మోకాళ్ళు, తొడలు , అన్ని జాయింట్లు వీని యందు అమితమైన పోటు తో కూడిన వాపు ఏర్పడుతుంది ఆమం చేరిన ప్రతిచోట తేళ్లు కుట్టినట్టు బాధ కలుగుతుంది. అజీర్ణం , నోట్లోనీరు వురడం , అరుచి , శరీరం బరువు , ముఖం పీక్కుపోవడం అతి మూత్రం , తాపము, కడుపు గట్టిపడటం , కడుపులో తీవ్రమయిన నొప్పి , దప్పిక , వాంతి , మూర్చ , జడత్వం జ గుండేనొప్పి , మలం స్థంబించడం , పేగులు అరవడం , జ్వరము మొదలయిన ఉపద్రవాలు సంభవించును.