Search This Blog

Chodavaramnet Followers

Thursday 14 April 2016

HEALTH BENEFITS WITH KARIVEPAKU


రక్తహీనత నివారణకు కరివేపాకు....!

వంటింట్లో కరివేపాకు లేకపోతే చాలా కూరలకు రుచి, సువాసన రాదంటారు. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు నిపుణులు. 

కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్‌లు కరివేపాకులో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ఇందులోని పీచు సహకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అజీర్తి సమస్యలతో బాధపడేవారు...గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువ, కరివేపాకు, సోంపు కలిపి తాగితే సమస్య దూరమవుతుంది. శరీరానికి చల్లదనం కూడా అందించినట్టవుతుంది.

* కరివేపాకు దృష్టిలోపాన్ని సరిదిద్దుతుంది. రోజూ తినే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల వయసు పెరిగిన తరవాత వచ్చే క్యాటరాక్ట్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పచ్చి కరివేపాకుని తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

* అధిక బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఆహారంలో కరివేపాకుని తప్పకుండా చేర్చుకోవాలి. రోజూ నాలుగు పచ్చి కరివేపాకుల్ని తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.

* బాలింతల్లో పాలు బాగా పడటానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనతను నివారిస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి తొందరగా కోలుకోవడానికీ ఇది సహకరిస్తుంది. అందుకే, సమృద్ధిగా తినాలంటారు నిపుణులు.