Search This Blog

Chodavaramnet Followers

Friday 4 March 2016

INFORMATION ABOUT BELLAM - JAGGERY AND ITS HEALTH BENEFITS AND ITS VITAMINS CONTENT


బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. 
దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు
పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .
అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .
కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు .(బహిష్ట సమస్యలు ఉండవు .).
నేయి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .
ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .
కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ సుగర్‌'గా వ్యవహరిస్తారు

పోషక విలువలు (100 గ్రాములకు)[మార్చు]
కాలోరీస్ ------------------19 cal/tbsp,
విటమిన్ బి కాంప్లెక్ష్ --------1 g/kg ,
ఫోలిక్ ఆసిడ్ ------------- 1 mg /kg ,
ఐరన్ --------------------2.6 mg /100 Grms,
కాల్సిం ------------------8.0 mg /100 Grms,
ఫాస్ఫోరస్---------------- 3-4 mg / 100 Grms,
మెగ్నీషియం -------------8 mg / 100 Grms,
పొటాసియం -------------4.8 mg / 100 Grms