Search This Blog

Chodavaramnet Followers

Monday, 21 March 2016

ADVANTAGES OF USAGE OF COPPER ITEMS IN DAILY LIFE


రాగి పాత్రలతో అనారోగ్యానికి చెక్ పెట్టేయండిలా!

మన భారత దేశంలో శతాబ్దాలకు మునుపే నీరును శుభ్రపరిచేందుకు రాగిప్రాతలు వాడేవారు. రాగి చెంబులతో నీరును త్రాగేవారు. మరి ఈ రాగి చెంబులు వాడటంలోని అంతర్యం ఏమిటి? అని పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధనల్లో వారికి ఎన్నో అశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. సూర్యకిరణాలు రాగి పాత్ర నీటిలో పడినప్పుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయని గ్రహించారు.

భారతీయ సాంప్రదాయల్లో ఒకటిగా రాగి పాత్రలను ఉపయోగించడం జరుగుతుంది. రాగి పాత్రలో నీటిని త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చును. శరీరంలో కాపర్‌ నిల్వలు తగ్గిపోవడం కారణంగా థైరాయిడ్‌ సమస్య వస్తుంది. దీంతో ఎక్కువ మొత్తంలో థైరాయిడ్‌ శరీరంలోకి విడుదలై హైపర్‌ థైరాయిడిజం సమస్య వస్తుంది. కాబట్టి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్‌ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్యలను నివారించవచ్చు.

అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితం ఉంఉంది. అలాగే మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్‌ లకు కవచంలా ఉపయోగపడే మైలీన్‌ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది. పైగా నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. లోహాలు జరిపే స్టెరిలైజింగ్‌ చర్యలో భాగంగా రాగి బ్యాక్టీరియాను చంపుతుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా లాంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్‌ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గిస్తుంది. ఎముకలు పటిష్టత ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను నివారించడంలో రాగి పాత్రలో నీళ్ళు ఎంత గానో ఉపయోగపడతాయి.