Search This Blog

Chodavaramnet Followers

Saturday, 20 February 2016

HEALTH BENEFITS WITH LAVANGAM - INDIAN SPICES HEALTH TIPS IN TELUGU


లవంగం తో ఉపయోగం

01. లవంగం లో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పి ని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.

02. దగ్గుకు సహజమైనా మందు లవంగం. దగ్గుకు, శ్వాస సంబంధింత సమస్యలకు కూడా లవంగం చాలావరకు పని చేస్తుంది. లవంగం మన తినే ఆహారం లో తీసుకుంటే మంచిది.

03. వాంతులు, కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

04. తేనె, కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

05. లవంగాలు ఏ వంటకంలోనైన వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

06. తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమం టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

07. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

08. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.

09. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకొవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.

10. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది.