Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 February 2016

EXPERTS ANALYSIS ABOUT EATING BROWN RICE


బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం) ఆరోగ్యప్రయోజనాలు...!

బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం. పాలిష్ చేయని బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. అసలు పాలిష్ పెట్టకుండా కేవలం వడ్ల పైన వుండే బయటి పొరను తొలిగిస్తే బియ్యపు గింజ గోధుమ రంగు లో వుంటుంది. పాలిష్ బాగా ఎక్కువ చేస్తే బియ్యపు గింజ తెల్లగా వుంటుంది. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం.

గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది. గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది.

బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది. బ్రౌన్ రైస్ లో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పీచు సమృద్ధిగా ఉండటం వలన బ్రౌన్ రైస్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టె౦పుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తిన్నందున రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడుతుందని కనుగొన్నారు.