దానిమ్మ పండులో ఉండే చిన్ని విత్తనాలను అరిల్స్ అని పిలుస్తుంటాము. ఈ అరిల్స్ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ , ఫిల్లెట్, విటమిన్ కె, మరియు షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు అరిల్స్ లో దాదాపు 144 క్యాలరీలు దాగున్నాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అందుకే దానిమ్మ పూర్తి పోషకాలను అందించే ప్యాకేజ్ గా పిలవబడుతున్నాయి.