Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 February 2016

BHAGAWADHGEETHA - DHARMALU


మానవులు పాటించవలసిన ధర్మాలు, చేయవలసిన పనులు, దర్శించవలసిన క్షేత్రాలు, తరించే తీర్ధాలు గురించి వివరించేవి పురాణాలు .ఇవి కధల రూపంలో ఉంటాయి.పురాణం అంటే సర్గ, ఉపసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరిత్ర అనే పంచలక్షణాలు కలిగి ఉంటుంది.
శ్రీ మహావిష్ణువు అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మ సూత్రాలు, మహాభారత రచన చేసిన మహర్షి, పురాణలు రచించినది వ్యాస మహర్షి అయితే వాటిని శౌనకుడు మొదలగు నైమిశారణ్య వాసులకు మరియు ఎనభైఎనిమిది వేల ఋషులకు తెలియజేసినది సూతమహాముని. వాటిని జనారణ్యానికి తెలిపినది శౌనక మహాముని మరియు ఆ ఋషిపుంగవులు. వ్యాసభగవానుడు రచించిన పద్దెనిమిది పురాణాల పేర్లు ఈ క్రింద శ్లోకంగా కూర్చబడినది.
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప లింగ కూస్కాని
పురాణాని ప్రచక్షత
మద్వయం : " మ" కారంతో రెండు. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం.
భద్వయం: " భ" కారంతో రెండు. అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: " బ్ర" కారంతో మూడు. అవి బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్తన పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచతుష్టయం : " వ" కారంతో నాలుగు. అవి వాయుపురాణం, వరాహపురాణం, వామనపురాణం, విష్ణు పురాణం.
అనాపలింగ కూస్కా : "అ" కారంతో అగ్ని పురాణం, " నా" కారంతో నారద పురాణం, " ప" కారంతో పద్మ పురాణం", "లిం" కారంతో లింగపురాణం, " గ" కారంతో గరుడపురాణం, " కూ" కారంతో కూర్మపురాణం. మరియు " స్క" కారంతో స్కాందపురాణం అనేవి మొత్తం పురాణాల పేర్లు.