Search This Blog

Chodavaramnet Followers

Sunday 17 January 2016

IMPORTANCE OF PUSHYA MASAM - BHAKTHI ARTICLES IN TELUGU


ARTICLE BY THE GREAT  Bramhasri Samavedam Shanmukha Sarma

పుష్య మాసం - నువ్వులు , బెల్లం ప్రాముఖ్యత 

పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలు అయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం (ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ..ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత . శనికి అధి దేవత యముడు. "యమం " అంటే "సం యమం" అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగ మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శ్క్తి లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది.

శని ధర్మ దర్శి. న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను,పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శనికి పైన చెప్పిన గుణాలు అన్నీ పొందవచ్చు. ఎప్పుడూ మనిషి వీటిని పొదుతాడో ,అప్పుడతడు బృహస్పతి వంటి వాడు అవుతాడు. అందువల్ల,పుష్యమి నక్షత్రానికి బృహస్పతిని అధి దేవతగా చెప్తారు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థనం అని నిరూపితమైంది. పరమాత్ముని నాభీ కమలం నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడు. ఎప్పుడు శరీరంలోని ఈ నాభి ప్రదేఅశాన్ని శని ప్రదేఅసమని చెప్పారో, అప్పుడే ఈ ప్రదేఅశనికి ఇవ్వభదిన ప్రాముఖ్య మంతటికి శని ప్రభావమే కారణం అని చెప్పినట్లు మనం గ్రహించాలి.