Search This Blog

Chodavaramnet Followers

Monday, 11 January 2016

HEALTH BENEFITS WITH COCONUT MILK


తల్లిపాల తర్వాత ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన, ఆరోగ్యదాయకమైన పానీయంగా కొబ్బరిపాలు రెండో స్థానంలో నిలిచాయి. అమ్మపాలకున్న విశిష్టగుణం వీటికీ ఉండటంతో కొబ్బరి పాలు ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండుగా మారే అవకాశముందని భావిస్తున్నారు. వీటిని పానీయంగానే కాకుండా వంటకు కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం డైరీ పాలలో లాక్టోస్ అనే ఒకరకం చక్కెర పదార్థం ఉంటుంది. దీన్ని జీర్ణం చేసుకోవడం చాలామందికి కష్టం కావచ్చు.కానీ కొబ్బరి పాలలో అయితే ఈ పదార్థం కనిపించడం లేదని నిరూపించబడింది. అమెరికన్ న్యూట్రిషియన్ స్పెషలిస్టు డాక్టర్ జోష్ ఆక్స్ ప్రకారం కొబ్బరి పాలు తల్లి పాల తర్వాత రెండో ఉత్తమమైన పాలుగా నిలుస్తున్నాయి.

శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలలో తల్లిపాలను, అదనపు ఆహార అనుబంధాలను తగినంతగా పొందని పిల్లలకు ఆవుపాలకు బదులుగా కొబ్బరిపాలనే విస్తృతంగా తాపిస్తున్నారని కేరళ లోని కొచ్చిలోని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) ఛైర్మన్ డాక్టర్ టి.కె జోస్ చెప్పారు. బాగా పండిన కొబ్బరి కాయ గుజ్జునుంచి కొబ్బరి పాలను తయారు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో దీన్ని కొబ్బరి పాలు అని పిలుస్తుండగా మరికొన్ని దేశాల్లో దీన్ని కొబ్బరి జ్యూస్ అంటున్నారు. ఈ టెక్నాలజీని తామే కనిపెట్టామని, దీన్ని మార్పిడి చేయడానికి అందుబాటులో ఉంచుతున్నామని జోస్ చెప్పారు.

మూడు నెలల కాలంలో కేరళ రాష్ట్రంలోని కొబ్బరి ఉత్పత్తిదారులు ఈ అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి పోటీ పడతారని జోస్ చెప్పారు. కోకోనట్ జ్యూస్‌లో కొలెస్ట్రాల్ జీరో స్థాయిలో ఉండటమే కాదు.. ఎనర్జీ వాల్యూ కూడా 100 మిల్లీలీటర్లకు 75 క్కాల్‌ల వరకు ఉంటుందని జోస్ తెలిపారు. కొబ్బరి పువ్వునుంచి తీస్తున్న నీరా పానీయం తర్వాత కోకోనట్ పాలు లేదా జ్యూస్ మన రైతులకు భారీ ఆదాయ వనరుగా మారుతున్నాయని ఇది మార్కెట్లోకి వచ్చాక రైతులకు కొబ్బరిపై న్యాయమైన ధర లభిస్తుదని జోస్ పేర్కొన్నారు.