21st January Hugging Day
నేడు కౌగిలింతల దినోత్సవం. చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే లాంటివి మనకు తెలుసుకాని ఇలాటిది కూడా ఒకటుందా అని ఆలోచిస్తున్నారా..? 1986 జనవరి 21న కేవిల్ జాబోర్ని అనే వ్యక్తి అమెరికాలో Hugging Day ని పరిచయం చేశాడు. మరో విషయం ఏమిటంటే ఈరోజు అక్కడ పబ్లిక్ హాలిడే కూడా. కౌగిలింత ఓ చక్కటి అనుభూతి అనేది శాస్త్రవేత్తల అబిప్రాయం కూడా. అమితంగా అభిమానించే వారిని, ప్రేమించేవారిని కౌగలించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని ఇటీవలే ఓ రిసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. మరో విషయం ఏమిటంటే ఆత్మహత్యకు పాల్పడేవారు, చివరి కణంలో తాము ప్రేమించే వ్యక్తులను కౌగలించు కోవాలని అనుకుంటారట.