Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 January 2016

BRIEF INFORMATION ABOUT ASTA VIDHA KALIKA MURTHULU


అష్టవిధ కాళికా మూర్తులు

తమో గర్భంలో దాగివున్న వెలుగుని, మృత్యు గర్భంలో దాగి వున్న చేతనను, ఆ విద్యలో బీజ భూతంగా నిద్రాణ స్థితిలో ఉన్న జ్!నానాన్ని మేల్కొలిపే ప్రాణ రూపమైన మహా ప్రచండాగ్ని కాళికా దేవి. అలాంటి కాళికా మూర్తుల వర్ణన ఏమిటంటే.. 

1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక. 

ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి కాళికాదేవి అనేక రూపాలలో ఆయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం పేర్కొంది. ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలు కుడా చెప్పబడ్డాయి.

కాలాన్ని నడిపించేది, సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టేదీ కాళికాదేవి. కఠినతరమైన ఆ ఉపాసన చేయగలిగితే అనంత శుభ ఫలాలు అందుతాయి. శిధిలాలను తొలగించి నూతన నిర్మాణాన్ని చేపట్టిన విధం మహాకాళిక తత్వంలో ప్రకటితమవుతుంది.

కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళ్ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు. దృఢచిత్తముతో అనాది రూప సర్వకారణుడైన ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఉపాసన. ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోతే, నదీ తీరంలోనో దేవాలయంలోనో కూర్చొని ప్రార్థన చేయటమో, ఏ దేవతనో గురించి భజన చేయటమో ఈశ్వరోపాసన అనిపించుకోదు.

కాళికాదేవి శక్తి అనంతమైనది. ఆమెను ఉపాసించటం వలన ఐహితమైన- పారలౌకికమైన అనేక ఫలితాలు లభిస్తాయి. అలాంటి విశ్వాసంతో, కాళికాదేవి విగ్రహాన్ని ముందుంచుకొని ఉపాసిస్తే, అది కాళికాదేవిపాసన అవుతుంది. కాని అది ఈశ్వరోపాసన కాదు. ఒకవేళే ఏదైనా సాకారమైన పదార్థాన్ని ఈశ్వర స్వరూపమని ఉపాసిస్తే అది ఈశ్వరోపాసన అవుతుంది.