Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 15 December 2015

DRY FRUITS - ENDU DRAKSHA CONTAINS IRON VITAMIN-B ETC GIVES GOOD HEALTH


ఎండు ద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరి చేరవు.
రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్.. చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం యాసిడోసిస్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి. ఎండు ద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.