Search This Blog

Chodavaramnet Followers

Monday, 21 December 2015

BENEFITS WITH LADIES FINGER - BENDAKAYA AROGYA RAHASYALU


బెండ కాయలు 

బెండకాయ(వంటల)తో మెదడు చురుకు గా పనిచేస్తుంది 
బెండకాయలో 90 శాతం నీరు, 6.4 శాతం పిండి పదార్థాలు, 1.9 శాతం మాంసకృత్తులు, 0.2 శాతం కొవ్వు పదార్థాలు, 1.2 శాతం పీచు, 0.7 శాతం ఖనిజ లవణాలు ఉండి, 33 కిలో ేకలరీలు శక్తిని ఇస్తారుు. 66 మి.గ్రా. సున్నం, 56 మి.గ్రా. భాస్వరం, 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నారుు. ెకరోటిన్‌ 52 మైక్రోగ్రాములు, 0.07 మి.గ్రా. థయమిన్‌, 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్‌, 0.6 మి.గ్రా. నియసిన్‌, పోలిక్‌ ఆమ్లం 105 మైక్రో గ్రాములు, ‘సి’ విటమిను 13 మి.గ్రా.లు ఉన్నారుు. ఇవేగాక సూక్ష్మధాతువులైన మెగ్నీషియం (53 మి.గ్రా.), సోడియం (6.9 మి.గ్రా.), పొటాషియం (103 మి.గ్రా.), రాగి (113 మి.గ్రా.), మాంగనీస్‌ (149 మి.గ్రా.), జింక్‌ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటారుు.

ఆరొగ్యకర ఉపయోగాలు

బెండకాయలోని మ్యూకస్‌ వంటి పదార్ధము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ‘సి’ దీనిలో చాలా ఎక్కువ. మ్యూకస్‌ పదార్ధం గాస్ట్రిక్‌ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారం. దీనిలోగల డయూరిటిక్‌ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్‌ ఇంఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్‌ తగ్గుతుంది. చెక్కెర(డయాబిటీస్‌) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాలు పాటు తాగితే సుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే
పెక్టిన్‌ బ్లడ్‌ కొలెస్టిరాల్‌ను తగ్గించును.

అనేక పోషక విలువలు వున్న కారణం గా మన పెద్దలు యివి
తింటే లెక్కలు బాగా వస్తాయ్యి అనటం పరిపాటి