Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 3 November 2015

MAHAKAVI DURJATI PADYALU


ధూర్జటి .. శ్రీ కాళహస్తీశ్వర శతకం ! 

అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో

నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
యంతా నంత శరీర శోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింత న్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

ఈశ్వరా! ఈ ప్రపంచంలో పుట్టిన మానవునికి అంతా సందేహమే.
శరీరం ఎంతకాలముంటుందో సంశయమే! మనసులో దారపుత్రాది
బంధనాలను ఏర్పరచుకొన్నందువలన అంతా దుఃఖమే!
శరీరమునకు రోగమెప్పుడు వస్తుందో అని భయం.
ఏ పని చేసినా అంతా శరీరమును కృశింపజేసేదే!
మనిషి చేస్తున్న పనులన్నీ దుర్వ్యాపారాలే!
(అనగా భగవంతుని చేరటానికి చేసే పనులు సద్వ్యాపారాలు. అలాకాక బ్రతుకు తెరువుకు ఇతరులను బాధించే పనులన్నీ దుర్వ్యాపారాలే.)
అంతేకాక ఇవి అన్నీ కర్మబంధములు కలిగించి పునర్జన్మలు కలిగిస్తాయి కనుక, ఇవి కూడా దుర్వ్యాపారాలే. వీటినన్నింటినీ విడిచి నరులు నిన్ను చేరు ఉపాయం ఆలోచించరేమి?