ప్రభోదిని ఏకాదశి.
22/11/2015.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ దశమి వరకు విష్ణుమూర్తి యోగనిద్ర లో ఉంటాడట. కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు జాగృదావస్థ లో ఉంటాడట. విష్ణుమూర్తి యోగనిద్ర చాలించిన తరవాత వచ్చే ఏకాదశి కాబట్టి దీనిని ప్రభోదిని ఏకాదశి అని అంటారు . భక్తులు ఈ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసదీక్షతో ఆచరిస్తారు. రోజంతా నారాయణ మంత్రం , విష్ణు సహస్రనామం జపిస్తూ గడిపి సాయంత్రం ఉప్పు వెయ్యని వంటకాలని నారాయణునికి నివేదించి ఉపవాసదీక్షను విడుస్తారు.
ఏకాదశి తిధి విష్ణుప్రీతికరమైనది. అందునా కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ఎంతోమహిమాన్వితమైనది. కార్తీక శుద్ధ ఏకాదశికి బృందావన ఏకాదశి అని కూడా పేరు.
ఆ ప్రబోధన మంత్రం
!ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! త్యజనిద్రాం జగత్పతే!
త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్దీని
తో ప్రార్థన చేసి, ఈ రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం చేయాలి. భాగవతం లోని, " అంబరీషోపాఖ్యానం" పఠనం, శ్రవణం శ్రేష్ఠం. రాత్రి పూట విష్ణునామకీర్తనతో కాలంగడపాలి. తులసి వనంలో గానీ, తులసి కోట దగ్గర గానీ విష్ణుపూజ చేయాలి. తులసి వనాన్ని " బృందావనం " అంటారు.