Search This Blog

Chodavaramnet Followers

Thursday 15 October 2015

DASARA FESTIVAL 3RD DAY GODDESS SRI KANAKA DURGA AMMAVARI ALANKARAM - SRI ANNAPURNA DEVI


దసరా ఉత్సవాలలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్దచిత్తాయై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మహాభగవత్యై / దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థ దాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటింబిన్యై నమః
ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం శంకరప్రియవల్లభాయై నమః
ఓం సర్వధారాయై నమః
ఓం మహాసాధ్వ్యై నమః
.
ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః అన్నపూర్ణాదేవి ‘’ ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‘’
దసరా ఉత్సవాలలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. “ హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా ” అనే మంత్రం జపించాలి. అమ్మవారికి దద్థ్యన్నం, కట్టెపొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.