Search This Blog

Chodavaramnet Followers

Thursday 15 October 2015

DASARA FESTIVAL 2015 INFORMATION AT VIJAYAWADA INDRAKEELADRI SRI KANAKA DURGA TEMPLE


దసరా మహోత్సవములు – 2015
వ.సంవారముతిదిశ్రీ అమ్మవారి దివ్య అలంకరములు
ది:13-10-2015మంగళవారముఆశ్వయుజ శుద్ధ పాడ్యమిశ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ది:14-10-2015బుధవారముఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు)శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ది:15-10-2015గురువారముఆశ్వయుజ శుద్ధ విదియశ్రీ గాయత్రి దేవి 
ది:16-10-2015శుక్రవారముఆశ్వయుజ శుద్ధ తదియశ్రీ మహాలక్ష్మిదేవి 
ది:17-10-2015శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితిశ్రీ అన్నపూర్ణా దేవి 
ది:18-10-2015ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమిశ్రీ లలిత త్రిపుర సుందరి దేవి 
ది:19-10-2015సోమవారముఆశ్వయుజ శుద్ధ షష్ఠిశ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ది:20-10-2015మంగళవారముఆశ్వయుజ శుద్ధ సప్తమిశ్రీ దుర్గా దేవి  
ది:21-10-2015బుధవారముఆశ్వయుజ శుద్ధ అష్టమిశ్రీ మహిషాసురమర్ధినీ దేవి
 ది:22-10-2015గురువారము ఆశ్వయుజ శుద్ధ నవమి/దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి
నవరాత్రి (దసరా)   
 మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము, ఆ తల్లికి ఇష్టమైన రంగు
   వ.సంశ్రీ అమ్మవారి దివ్య అలంకరములురంగునైవేద్యం
1బాలత్రిపుర సుందరినీలం రంగుఉప్పు పొంగల్
2గాయిత్రి దేవిపసుపు రంగుపులిహోర
3అన్నపూర్ణా దేవిలేత రంగుకొబ్బరి అన్నం
4శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిఆకాషం రంగుఅల్లం గారెలు
5సరస్వతి దేవికనకంబరం రంగుపెరుగన్నం
6మహాలక్ష్మీ దేవితెలుపు రంగురవ్వకేసరి
7దుర్గాదేవిమెరున్ రంగు (ముదురు ఎరుపు)  కదంబం (వెజిటబుల్,  రైస్ కలిపి వండే ఐటం)
8మహిషాసురమర్థిని దేవిఎర్రటి ఎరుపు రంగుబెల్లమన్నం
9రాజరాజేశ్వరి దేవిఆకుపచ్చ రంగుపరమాన్నం
ఇలా 9 రోజులు తొమ్మిది రకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులు చేసి ప్రసన్నులు కావచ్చు.