Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 14 October 2015

BRIEF AND DETAILED TELUGU INFORMATION ABOUT DASARA FESTIVAL 2015 - SARANNAVARATHRULU


శరన్నవరాత్రులు
శరద్ ఋతువునందు జరుపుకునే నవరాత్రులు కనుక ఆ పేరు వొచ్చింది.. శరదృతువు ఆశ్వయుజ మాసంలో ఉంటుంది ,ఆ తరువాత 
ఉంటుంది, నవరాత్రులు చేయ్యాలనుకున్నప్పుడు అవే తిథులు ఇంకో మాసంలో వున్నా వాటిని పరిగణలోకి తెసుకొని శరన్నవరాత్రులుగా చెయ్యకూడదు..
ఆశ్వయుజ మాసంలో పాడ్యమి దగ్గరనించి నవమి వరకు నవరాత్రులుగా జరుపుకొబడుతున్నాయి ..
ఈ కాలంలో చంద్రునికి" పరిణితిచంద్రుడు" అని పేరు.. శరత్కాలంలో తెలుపుదనం ఎక్కువ.చంద్ర బింబంలో నుంచి వచ్చే కాంతి విశేషంగాఉంటుంది.
అమ్మల గన్నం అమ్మ శారదాదేవి కుడా తెల్లగా ఉంటుంది.. శరదృతువులో ఆశ్వయుజమాసంలో పాడ్యమి నించి నవమివరకు వున్న తొమ్మిది తిథులు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా
పొందడానికి ,ధ్యానం చేయడానికి చాల యోగ్యమైన కాలంగా ఋషుల చేత నిర్ణయించబడింది . విశేషంగా ఈ తొమ్మిది రోజులు గడిపితే అమ్మ అనుగ్రహం కలుగుతుంది ..
మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత కలుగుతుంది...నవరాత్రులలో పూజ చెయ్యకుండా ఉండ కూడదు ,
అమ్మవారి ఆరాధన లో,ఈస్వరారాధనలో కాలం గడపాలి , ఈ కాలం సంవత్సారానికి ఒక్కసారి మాత్రమె వస్తుంది ..
ఈ కాలాన్ని తప్పకుండ సద్వినియోగించు కోమని శాస్త్రం చెపుతుంది, మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వోక్కరు ఈ సమయాన్ని నిరుపయోగంగా గడపకూడదు ,
ఈ నవరాత్రులకి ఖ్యాతి,పవిత్రత ఎందువల్ల అంటే
శరదృతువునందు ఆకాశం మేఘావృతమై ఉండదు, ఆకాశం ఆహ్లాదంగా ఉండి, దూది
పింజలలా తెల్లటి మేఘాలు ఆకాశంతా ఆవరించి అత్యంత వేగంగా వేల్లిపోతుంటాయి .జగత్తుకి మేఘాలు శ్రావణ, భాద్రపద మాసాలలో విశేషం గా వర్షించి ఉపకారంచేస్తాయి...
తమదగ్గరవున్నదంతా వర్షించి వెళ్లి పోతున్న మేఘాలను చూసి నమస్కారం చెయ్యకుండా ఉండలేము... ఉన్నదంతా మనకిచ్చి మన అభ్యున్నతిని అకాక్షించి
మనం కృతజ్ఞత చెప్పామా లేదా అన్నది కుడా చూసుకోకుండా ఎక్కడో సముద్రం లో వున్న ఉప్పు నీటిని తాగి ఉప్పునీటిని మంచి నీరుగా మార్చి,మంచి నీటిని , చల్లని నీటిని వర్షించి,
జీవుల దాహార్తిని తీర్చి పాడిపంటలను పొంది సమృద్దిగా ఉండేటట్లుగా అనుగ్రహించిన మేఘస్వరూపామా నీకు నమస్కారం ...
భారత దేశమమతా కలిపి ఒక ప్రమాణంగా తీసుకుంటే దక్షిణ భారత దేశం లో చలి పెరుగుతున్నదనే సమయంలో ఉత్తరభారతదేశంలోచలి ఎముకలు కోరికేస్తంది,
భారతదేశమంతా కలిపి ఒక స్థితిలో ఆలోచన చేస్తే ఎప్పుడు ఒక చోట వున్న ఉపాసనా యోగ్యత రెండో చోట ఉండదు ఒక చోట ఒకలా ఉంటే ఇంకో చోట ఇంకోలా ఉంటుంది ..
శరత్కాలంలో తొమ్మిది రోజులు మాత్రం భారతదేశం లో ఏ మూల నించి ఏమూలకి చూసినా సమతులంగానే ఉంటుంది .అందువల్లే ఈ కాలం చాల యోగ్యమైనదని ఋషులు నిర్ణయించారు....
అందువల్లనే ఈ శరత్కాలం లో శరన్నవరాత్రులను జరుపోకోవడం ఆనవాయితీగా వచ్చింది...