శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి