"సరసపు స్వర్గాల సాగగా రావ !"
"ద్విపద మాలిక "......................... .డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ
ఎదుటనే నిలిచితి , ఏలనే యలుక !
మదినిటు పరచితి , మమతలు యొలుక !
పలుకుల ముత్యాలు , పారనీ చిలుక !
వలపుల చినుకుల , వాటము దెలియు !
తలపుల పూదోట , తన్మయ మొసగు !
మరుడిల కేతెంచి మాయలు సేయ !
కురియును ప్రేమలు కూరిమి తోడ !
చాలిక యలుకలు చాలిక చెలియ !
జాలిని జూపని జాణవ నీవు !
మాలిమి తెలియని మగువవు కావు !
మమతల పొంగుల మానిని వీవు !
మౌనము చాలించి మనసును దెలుపు !
సరసము నొంపేను , జాబిలి వేళ !
సరసకు చేరగా సర్వము దెలియు !
జాలిగ చూసేను , జాజులు బాల !
మల్లెల ఘుమఘుమ మత్తును జల్లె !
తెల్లని వెన్నెల తేనెలు కురిసె !
ఉల్లము ఝల్లని ఊహలు రేపె !
చాలిక యలుకలు చాలిక చెలియ !
సరసపు స్వర్గాల సాగగా రావ !
చాలిక యలుకలు చాలిక చెలియ !
సరసపు స్వర్గాల సాగగా రావ !
"ద్విపద మాలిక "...............డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.
"ద్విపద మాలిక ".........................
ఎదుటనే నిలిచితి , ఏలనే యలుక !
మదినిటు పరచితి , మమతలు యొలుక !
పలుకుల ముత్యాలు , పారనీ చిలుక !
వలపుల చినుకుల , వాటము దెలియు !
తలపుల పూదోట , తన్మయ మొసగు !
మరుడిల కేతెంచి మాయలు సేయ !
కురియును ప్రేమలు కూరిమి తోడ !
చాలిక యలుకలు చాలిక చెలియ !
జాలిని జూపని జాణవ నీవు !
మాలిమి తెలియని మగువవు కావు !
మమతల పొంగుల మానిని వీవు !
మౌనము చాలించి మనసును దెలుపు !
సరసము నొంపేను , జాబిలి వేళ !
సరసకు చేరగా సర్వము దెలియు !
జాలిగ చూసేను , జాజులు బాల !
మల్లెల ఘుమఘుమ మత్తును జల్లె !
తెల్లని వెన్నెల తేనెలు కురిసె !
ఉల్లము ఝల్లని ఊహలు రేపె !
చాలిక యలుకలు చాలిక చెలియ !
సరసపు స్వర్గాల సాగగా రావ !
చాలిక యలుకలు చాలిక చెలియ !
సరసపు స్వర్గాల సాగగా రావ !
"ద్విపద మాలిక "...............డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.