Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 1 July 2015

WOMEN TELUGU BEAUTY TIPS FOR GEORGEOUS BEAUTY


 నాజూకైన అందం కోసం
కొందరు ఎంత తిన్నా ఏమాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. మరి కొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. ఇలాంటి వారినే ఊబకాయులు అంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం మీదే బరువు పెరగడం, తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలామంది మరిచిపోతుంటాం. బరువు తగ్గాలనుకునేవారు ఈ కింది సూచనలను గుర్తు పెట్టుకోవాలి.

ఆకలిని గుర్తించాలి...
ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. ఆ సూచనలను ఏ మాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, గంటన్నర తరువాతో ఆహారం తీసుకోవడం వలన ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం చేయడం మరిచిపోకూడదు...
ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలనుకునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసు కునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యా హ్నాం, రాత్రి భోజనంలో వరికి బదులు రాగులు, గోధుమలు,సజ్జలూ ఉపయోగించు కోవాలి. రాత్రి పడుకోవడానికి నాలుగు గంటలు ముందే భోజనం ముగించాలి.

చక్కెరకు దూరంగా...
బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవ చ్చు. వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసు కోవాలి.

ఆందోళన, ఒత్తిడికి దూరంగా...
బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పై రెండిటి కారణంగా అధికంగా తినేయడంతో బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది.

నిద్రలేమి...
కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.

వ్యాయామం...
వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాం టివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఆటలు కూడా మంచి వ్యాయామాన్నిస్తాయి. పెద్ద వయస్సులో ఆటలు ఏమిటి? అనుకోనవసరం లేదు.పిల్లలను తీసుకొని ప్లే గ్రౌండ్‌కి వెళ్లినప్పుడు వారి ఆటల్లో పాల్గొనవచ్చు. పిల్ల లతో కలిసి ఆడుకుంటే చాలు మరే ఇతర వ్యాయామాలు అక్కర్లేదు.