రుచితో పాటు..శక్తి..!
స్టవ్ మీద నుంచి ఏ వంటకం దించినా.. ఫైనల్ టచ్ దీంతో ఇవ్వాల్సిందే. చక్కని సువాసన.. కమ్మని రుచితో.. వంటకాలకు అదనపు రుచినిచ్చే శక్తి
కొత్తిమీరకు ఉంది.
కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ లు దీనిలో ఉంటాయి. ప్రొటీన్లు కూడా ఎక్కువే. దీన్ని తరచూ ఆహారంలో వాడటం వల్ల కొలెస్ట్రా ల్ సమస్య కొంత వరకు తీరుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి కొత్తిమీర చక్కని ఔషధంగా పని చేస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఇది సమన్వయం చేయగలదు.
కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయసు మళ్లిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. కొవ్వుని కరిగించే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికాంగా లభిస్తాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ లక్షనాలు నోటిపూతను అదుపులో ఉంచుతాయి.