వారం రోజులలో బరువు తగ్గాలంటే
ప్రస్తుత కాలమాన పరిస్తితుల్లో అందరికీ ఉన్న ఆశ తమ బరువు తగ్గించుకోవటం ఎలా అని..! ఏంచేస్తే బరువు తగ్గుతామా అని పొద్దున్నే లేచి వాకింగ్లు, యోగాలు, జిమ్లు ఇలా ఎన్నో విధాలుగా శతకోటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గించుకోవటమనేది మీ చేతిలోని పనే అంటే చాలా మంది విశ్వశించరు. మన బరువును మనమే తగ్గించుకోవచ్చు. వారంరోజులపాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏ మాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను కరిగించడానికి ఈ విధంగా టైం టేబుల్ వెసుకుంటే వారంలో బరువు తగ్గవచ్చు. మీరు ఉండాల్సిన దానికన్నా అదనంగా ఎంత బరువు ఉన్నారో చూసుకోవాలి. ప్రతిరోజు ఆహార నియమాలతో పాటు చివర ఇచ్చిన సాధారణ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
మొదటిరోజున అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు మీ ఆహారం గా తీసుకోవాలి. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటంవల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధ పరుస్తున్నట్టు అర్థం.
రెండవరోజున ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలిసి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును మొదలుపెట్టండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడకూడదు. మీకు నచ్చినంత తినవచ్చు.
మూడవ రోజున అరటిపండు, బంగాళాదుపం తప్ప మిగిలిన పళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. మీకు కావలసినంత తినవచ్చు ఇప్పటి నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభం అవుతుంది.
నాల్గవ రోజున 8 అరటిపళ్ళు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. నాల్గవ రోజు దాదాపు ఆకలి ఉండకపోగా రోజంతా హాయిగా గడిచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పాలి. తగ్గించగలిగితే మరింత మంచిది. మీకు ఏదైనా ఇంకా త్రాగాలనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్ సూప్ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి).
ఐదవ రోజున ఒక కప్పు అన్నం, 6 టమోటాలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తీసుకొన్డి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. కప్పు అన్నం మాత్రమే తినండి.
ఆరవ రోజున ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. రెండవరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బంగాలా దుంప మినహా) తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే, కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల రెండవరోజు తిన్నంత అవసరం లేదు.
ఏడవ రోజున ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. ఆరవరోజులాగే తింటూ, ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోవాలి. మధ్యాహ్నం యథావిథిగా ఒకప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినటానికి ప్రయత్నించండి. మీలో మార్పు మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం కనిపెట్టగలరు. వారం తర్వాత మీకు మీరే అవాక్కవుతారు.