Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 22 April 2015

VITAMINS AVAILABLE IN GUAVA FRUIT - HEALTH SECRETS OF JAMA PANDU


జామపండు ఆరోగ్య రహస్యాలు 

అతి తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్‌ కలిగి, ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.

ఎక్కువ పీచు పదార్థం (పైబర్‌) కలిగి ఉంటుంది. మలబద్ద కాన్ని తగ్గిస్తుంది.

వయసుకు ముందే ముఖంపై కలిగి ఉంటుంది. మలబద్ద కాన్ని తగ్గిస్తుంది.

ఎ,బి,సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
దీనిలో విటమిన్‌ ఎ, ఫ్లావనాయిడ్స్‌, బీటాకెరోటిన్‌, లైకోపిన్‌ ఉండడం వల్ల ఉపరితిత్తులకు చర్మానికి కంటికి చాలా మంచిది.

అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్‌ కారకాలను జామకాయలో ఉండే లైకోపిన్‌ అడ్డుకుంటుంది.
జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.

అంతేకాకుండా, జమకాయలో బి కాంప్లెక్స్‌ విటమిన్స్‌ బి6, బి9, ఇ,కె విటమిన్లు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

కాబట్టి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఎన్నో ఆరోగ్య విలువలు కలిగిన మన జామకాయను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.