మూలాధారాంబుజారూఢా - మూలాధార పద్మము నందు అధివసించునది.
పంచ వక్త్రా - ఐదు ముఖములతో నుండునది.
అస్థి సంస్థితా - ఎముకలను ఆశ్రయించి ఉండునది.
అంకుశాది ప్రహరణా - అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
వరదాది నిషేవితా - వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.
ముద్గౌదనాసక్తచిత్తా - పులగము నందు ప్రీతి కలది.
సాకిన్యంబా స్వరూపిణీ - సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.