స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?? స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏమిటి??ప్రధానంగా ఎందుకు వస్తుంది?? ఎవరికి వస్తుంది?? రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?? నివారణ ఉపాయాలు ఏమిటి??
Important and useful information.
స్వైన్ ఫ్లూ అనేది ప్రధానంగా పశువుల(పంది) మాంసం తినడంవలన ఫ్లూ ఉన్న జంతువుల మాంసం వలన మొదలైందని ఒక సమాచారం.
ఈ వైరస్ యొక్క నామం H1N1 ఇన్ఫ్లూఎంజ వైరస్ ఇది తరచుగా ప్రచార సాధనాలలో "స్వైన్ ఫ్లూ " (Swine Flu) అని పిలువబడుతున్నది.
స్వైన్ ఫ్లూ లక్షణాలు
మొదట సాధారణ జలుబులాగానే కనపడుతుంది.. కానీ ఆరు రోజుల తర్వాత ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, జ్వరం రావడం రావచ్చు..వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.
ఫ్లూ సీజన్‌లో జ్వరం రావటం, మందులు వాడినా, వాడకపోయినా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోవటం సహజమే. చిన్నపిల్లల విషయంలో... జ్వరం తగ్గిపోయిన వెంటనే పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఒక రోజంతా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలి.
చాలా మంది వ్యక్తులు కొద్దిపాటి తీవ్రత ఉన్న లక్షణాలనే అనుభవించినప్పటికీ, కొంతమంది మాత్రం చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్న లక్షణాలను చూపించారు. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ళ నొప్పులు మరియు వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతులు అవ్వటం లేదా విరేచనాలు వంటివి కొద్దిపాటి తీవ్రత ఉన్న లక్షణాలు.
ఈ లక్షణాలను కలిగి ఉన్నవారు తీవ్రమైన వ్యాధి బారిన పడతారు:
ఉబ్బసం ఉన్నవారు, చక్కెర వ్యాధిగ్రస్తులుఅధిక బరువు ఉన్నవారు, గుండె జబ్బు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి లేనివారు, నరాల అభివృద్ధి స్థితులు ఉన్న పిల్లలుమరియు గర్భిణీ స్త్రీలు
అదనంగా ఇంతకు ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో కూడా ఒక కొద్ది శాతం మంది రోగులు వైరల్ న్యుమోనియా బారిన పడ్డారు. ఇది తనంతట తానే పెరిగిన శ్వాస తీసుకొనే సమస్యగా రూపాంతరం చెందుతుంది మరియు సంక్లిష్టంగా ఫ్లూ లక్షణాలు మొదలయిన 3-6 రోజుల తరువాత వస్తుంది.
వ్యాపించకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలు:
చిన్నారులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పడు తప్పకుండా టిష్యూ పేపర్లను అడ్డు పెట్టుకోవాలని తల్లిదండ్రులు తెలియజెప్పాలి. అలాగే ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడవేయకుండా.. వెంటనే వాటిని చెత్తబుట్టలో పారవేయమని చెప్పాలి. అంతేగాకుండా, పిల్లలు తుమ్మిన ప్రతిసారీ వారి చేతులను శుభ్రం చేయడం మంచిది.
ఇక చివరిగా.. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లను వేయించటం ఉత్తమం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కూడా. అలాగే స్వైన్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఎలా వాడాలంటే.. మొత్తంమీద రెండు డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. మొదటి డోసు తర్వాత మూడు వారాల వ్యవధితో మరో డోసు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు శరీరం పూర్తిగా సన్నద్ధం కావాలంటే మరో రెండు వారాల సమయం
సోకకుండా నివారించుకొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు::
అయితే దీనిని తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, వీలైనన్ని సార్లు చేతులు కడుగుకోవడం తప్ప వేరే మార్గంలేదు...
ప్రతి ఇంట్లోనూ ఉండే తులసి ఆకులు ఉదయాన్నే నోటిలో వేసుకుని నమిలితే కొంత రోగనిరోధక శక్తి పెరుగుంది..
అడుగు పొడవున్న తిప్పతీగను తీసుకుని ఐదారు తులసి ఆకులతో కలిపి నీటిలో 20 నిమిషాలు మరిగించి రుచి కోసం నల్లమిరియాలు, సైంధవ లవణం, రాతి ఉప్పు, పటికబెల్లం కలుపుకుని గోరువెచ్చగా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు అంటున్నారు.
లేకుంటే రోజూ రెండు వెళ్లుళ్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తిన్నా ప్రయోజనముంటుందని, గోరువెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే కొంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రీవైటల్ లాంటి రోగనిరోధక శక్తిని పెంచే కాప్సూల్స్ కూడా ఒక విధంగా మంచివే... ఒకసారి స్వైన్ ఫ్లూ సోకినట్టు అనిపిస్తే వైద్యుల సలహాతీసుకోవడం మంచిదని వారు సలహాఇస్తున్నారు.
పైన తెలిపినవన్నీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే... మనది ఉష్ణ దేశం కాబట్టి కొన్ని రోజులలో వాతావరణంలో మార్పులు వచ్చి వ్యాధి తగ్గు ముఖం పట్టవచ్చు... ప్రతి జలుబు స్వైన్ ఫ్లూ కాదు.. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..
వీలైనంత వరకు షేక్ హ్యాండ్ లు తగ్గించి..మన భారతీయ సంస్కృతి ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి.. ఏ వ్యాధులు సంక్రమించవు..