బేకింగ్ సోడాతో తళతళలాడే దంతాలు
నవ్వు అందంగా కనిపించాలంటే పళ్లు శుభ్రంగా ఉండాలని అందరికీ తెలిసిందే. కాని నేడు అనేక అడ్విడైజ్‌మెంట్‌లతో ఎలాంటి టూత్‌పేస్ట్ వాడాలో అర్ధంకాక అన్ని వాడేస్తుంటారు చాలా మంది. కాని పళ్లు అందంగా ఉండాలంటే పళ్ళను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఏది పడితే అది వాడటం కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి.
ఇలాంటి ఎన్ని పేస్ట్‌లు వాడినా పళ్లు తెల్లగా రాకపోతే, చిటికెడు బేకింగ్‌సోడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోండి. ఎంత అందంగా తయారవుతాయో తెలుసా. దీనికి స్ట్రాబెర్రీ కూడా తోడైతే మరింత తళతళలాడే పళ్ళు మీ సొంతం అవుతాయి. అయితే బేకింగ్ సోడా ఆమ్లం కాబట్టి నెలలో రెండు, మూడు సార్లకన్నా ఎక్కవ వాడకూదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే పళ్లు పటుత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది.