Search This Blog

Chodavaramnet Followers

Thursday 15 January 2015

TRADITIONAL AND HEALTHY IMPORTANCE OF WEARING RED SINDHOOR BY INDIAN WOMEN


హిందు మతంలో ఎరుపు రంగు విశిష్టత మరియు రహస్యం

ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. మీకు తెలుసా?...డెస్టినీ కలర్ కూడా ఎరుపే. అయోమయం చెందకండి. ఎరుపు రంగుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎరుపు రంగుకి సంబంధించి ఎన్నో సర్ప్రైజింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ ఆర్టికల్ లో మీకు తెలియచేస్తాం. ఇక చదవండి మరి..
అందమైన రంగు ఎరుపు. హిందూయిజానికి చెందిన దాదాపు ప్రతి పండగలో అలాగే ఆచారంలో ఎరుపు రంగుకి అవినాభావ సంబంధముంది. హిందూ మతానికి చెందిన పెళ్లి వేడుకలలో ఎరుపు రంగుకి ఎంతో ప్రాధాన్యముంది. పెళ్లి కూతురి అలంకరణలో ఎరుపు రంగు విశేష పాత్ర పోషిస్తుంది. గమనిస్తే, కుంకుమ దగ్గర నుంచి పెళ్లి కూతురి అలంకరణకి సంబంధించిన ప్రతి అలంకరణలో ఎరుపు రంగు ప్రధానంగా ఉంటుంది.
ఎరుపు రంగు కనులకు విందుగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో శక్తిని జేనేరేట్ చేయడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది. మీలో దాగున్న భావోద్వేగాలను బయటపెట్టే శక్తి ఎరుపుకుంది. మీలో ఉన్న ప్రతిభా పాటవాలను అలాగే మీలో దాగున్న లక్ష్యాలను బయటకు తీసుకువచ్చే శక్తి ఎరుపు రంగుకుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో ఎరుపుకుండే ప్రాధాన్యం అనిర్వచనీయం. ప్రతి శుభప్రదమైన వేడుకలలో ఎరుపుని తప్పక ఉపయోగిస్తారు.
భారత్ లో ఎరుపుని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగుకున్న ఖ్యాతి విశ్వవ్యాప్తమైనది. వ్యక్తిగత జీవితంలో గాని, నిర్దిష్ట సమయానికి గాని, ఒక స్థలం మరియు చర్యకు ప్రతీకగా ఎరుపును చెప్పుకోవచ్చు. అయితే ఎరుపు ప్రాముఖ్యత వివిధ మతాలకు వేరు వేరుగా ఉన్నా ఏర్పుకున్న ప్రాముఖ్యత మాత్రం ప్రత్యేకతమైనది.
ఇలా హిందూ నమ్మకాలలో ఎరుపు రంగు వాడకం వెనకున్న రహస్యాల గురించి తెలుసుకుందాం..
* సిందూర్
హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు. హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.
* తిలకం
సాక్షాత్తు పరమశివుడి మూడవ కన్ను స్థానంగా భావిస్తున్న ప్రదేశంలో తిలకాన్ని దిద్దుతారు. అంతర్గత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తిలకాన్ని దిద్దుకుంటారు. అందువల్ల తిలకాన్ని దిద్దుకోవడానికి హిందువులు అమిత ప్రాధాన్యాన్నిస్తారు.
* ఇంద్రియాల రంగు
ఎరుపు రంగుకు కామేచ్చను ప్రేరేపించే గుణముంది. అందువల్ల పెళ్లి వేడుకలలో తప్పని సరిగా వధువుకు ఎరుపు రంగుని అలంకరిస్తారు.
* ఆకలిని పెంపొందిస్తుంది
ఆకలిని పెంపొందించడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది. అందుకే దాదాపు రెస్టారెంట్స్ అన్నింటినీ ఎరుపు రంగులో అలంకరిస్తారు.
* విజయం
విజయానికి సంకేతం ఎరుపు. అడ్వెంచర్, ప్రేమ, పవర్, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత, సంకల్పం, ఫ్లెక్సిబిలిటీ, ఉత్సాహం, లక్ష్యం మొదలగు వంటివి సాధించడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది.
* మరో కోణం
ఎరుపు రంగుతో కేవలం ఉపయోగాలే కాదు కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిలోని ప్రతికూల భావాలను ఎరుపు రంగు పెంచుతుందని అంటారు. శుభప్రదంగా భావించబడే ఎరుపు రంగుకి ఒక వ్యక్తికి చికాకు పుట్టించడం, ద్వేషాన్ని పెంచడం వంటి కొన్ని లక్షణాలు ఉంటాయని కొందరి అభిప్రాయం.