Search This Blog

Chodavaramnet Followers

Monday, 19 January 2015

HOW TO REMOVE WHITE SPOTS ON YOUR BEAUTIFUL FACE


తెల్లమచ్చలు తగ్లాలంటే?

ముక్కు, నుదురు, చెంపలపై వచ్చే తెల్లమచ్చలు ఎంత ఇబ్బందిపెడతాయో చెప్పలేం! వాటిని రసాయనాలతో కన్నా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలు ఉపయోగించి తగ్గించుకోవడం మేలు. 
చెంచా నిమ్మరసంలో అరచెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి దాంతో మచ్చలున్న చోట రుద్ది చూడండి. రోజులో రెండుసార్లు ఇలా చేస్తే తెల్లమచ్చలు తగ్గుతాయి. దాల్చినచెక్క పొడిని తేనెలో కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, తెల్లారాక కడిగినా మంచిదే. ఇలా
వారం పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

చెంచా ఓట్స్‌, అరచెంచా తేనెల మిశ్రమం కలిసేంత టొమాటో గుజ్జు తీసుకుని అన్నింటినీ మిశ్రమంలా చేసుకొని మచ్చలున్న చోటరాసి, రాత్రంతా వదిలేయాలి. మర్నాడు శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు చెంచాల ఓట్స్‌కి తగినంత పెరుగు, కొద్దిగా నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి రాసి రాత్రంతా ఉంచినా కొంతమార్పు కనిపిస్తుంది. 

చెంచా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చెంచా పెరుగు, అరచెంచా తేనె... అన్నింటిని కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుకి ఇరువైపుల చెంపలు, నుదురుపైనా రాసుకోవాలి. నిమ్మరసంలో పాలు, గులాబీ నీళ్ళ మిశ్రమాన్ని కలిపి రాసినా సమస్య తగ్గుతుంది. 

గుడ్డులోని తెల్లసొనని మచ్చలున్న చోట రాయండి. అది అరాక మరోసారి రాయండి. ఇలా నాలుగైదు సార్లు రాసి, ఆరాక కడిగేయండి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే చర్మం నిగారింపు పొందుతుంది. మచ్చలు తగ్గుముఖం పడతాయి.