Search This Blog

Chodavaramnet Followers

Monday, 12 January 2015

GODDESS VASAVI VYBHAVAM


వాసవీ వైభవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ లోని వాసవీకన్యకా పరమేశ్వరి దేవాలయం సుప్రసిద్ధ దర్శనీయ క్షేత్రం. ఇది ప్రత్యేకించి వైశ్యులకు వారణాసి అంతటి పవిత్ర ప్రదేశం. వాసవి మాత వైశ్యుల కుల దేవత మాత్రమె కాదు.. ఆమె ఆది పరాశక్తి అంశ. అఖిల హిందువులకు ఆరాధ్యనీయురాలు. ఆమెను కొలిచిన ఇంట కలిమికి కొరత ఉండదు. ఆమె ఆశీస్సులు లభిస్తే ఆ జీవితానికి తీరని ఈప్సితం ఉండదు. ఇది తరతరాల హైందవ విశ్వాసం. ప్రత్యేకించి వాసవి మాత తత్త్వం భారతీయతకు ప్రతిరూపం. అహింస, క్షమ, త్యాగం మూర్తీభవించిన అవతారం ఆమెది.