Search This Blog

Chodavaramnet Followers

Monday 12 January 2015

ARTICLE ABOUT THE STORY AND IMPORTANCE AND CELEBRATION HISTORY OF SANKRANTHI FESTIVAL / MAKARASANKRANTHI / PONGAL IN INDIA IN TELUGU AND ENGLISH


సంక్రాంతి - Makar Sankranti

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.


ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజుముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాతకుంభ, మీన, [[మేష రాశి|మేష],వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండీ మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి [1]- సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
దానాదులు.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడినది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీని లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు,పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు,పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషం తొ మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండాహరిదాసు ప్రత్యక్షమవుతాడు.
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయినమకర్‌సంక్రాంతి లేదా లోరీ ని మాత్రమే జరుపుకుంటారు.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.


పండుగ ప్రత్యేకతలు
ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌) ,చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు[2]. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.
రధం ముగ్గుపశ్చిమగోదావరి జిల్లాలో రధం ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.
గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
భోగిమంటభోగిలో వేయడానికి భోగిముళ్ళు ఈడ్చుకుని వస్తున్న దృశ్యం
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
భోగిపళ్ళు
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మబద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభప్రదంగా భావిస్తారు.
పుష్యమాసములో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రొజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు.
ధనుర్మాసం లో.. స్త్రీలు తెల్ల వారక ముందే లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పరమ పవిత్రమైన గోమయాన్ని గోబెమ్మలుగా తీర్చి ముగ్గు మధ్యలో వుంచి పువ్వులు , పసుపు కుంకుమల తో అలంకరిస్తారు.
గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగురంగుల పూవులు , పసుపు కుంకుమలు ముత్తైదువులకు సంకేతం .గోపీ+అమ్మలు=గోపెమ్మలు.. . అవే..జానపదుల వాడుకలో గొబ్బెమ్మలుగా మారాయి అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే గొబెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.పువ్వులు పెడతా రు. సాయంత్రమయ్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉంచుతారు.
కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు.. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబెమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. 
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
1. కొలని దోపరికి గొబ్బిళ్ళో 
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో 
కొలని దోపరికి గొబ్బిళ్ళో 
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో 
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో 
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండి పైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో 
కొలని దోపరికి గొబ్బిళ్ళో 
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
2. గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ 
మన సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ 
ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బియళ్ళొ 
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ 
ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ 
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియళ్ళొ
ధాన్యపు రాసుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ 
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ 
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియళ్ళొ
లక్ష్మి రధముల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియళ్ళొ 
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
ముంగిట ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గులోన పొంగళ్ళు గొబ్బియళ్ళొ
భోగి పళ్ళ సందళ్ళు గొబ్బియళ్ళొ 
మరదళ్ల సరదాలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ 
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
3. గొబ్బి సుబ్బమ్మ...
గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణీయవే.. 
చేమంతి పువ్వంటి చెల్లెలినియ్యవే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే-
అరటి పువ్వంటి అన్ననియ్యవే
మల్లె పువ్వంటీ మామానీయవే-
బంతి పువ్వంటి బావానియ్యవే
కుంకుమ పువ్వంటి కూతురునీయవే-
కొబ్బరి పువ్వంటి కొడుకునియ్యవే
అరటి పండంటి అల్లుణ్ణియ్యావే-
గులాబి పువ్వంటి గురువునియ్యావే
మొగలి రేకంటి మొగుణ్నియ్యావే.
సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహా ఘనంగా జరుగుతుంది. ప్రవాసాంధ్రులు తెలుగుతనాన్ని మర్చిపోకుండా వీలైనంతవరకూ పండుగ సంప్రదాయాలేవీ లోపించకుండా కళకళలాడేలా వైభవోపేతంగా జరుపుకోవడం మనకు తెలిసిందే. మరో సంగతి ఏమంటే మకరసంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలవాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు.
తమిళులు నాలుగు రోజులపాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు. మొదటిరోజును ''తై'' నాడు సూర్యుని, వానదేవుని ప్రార్థిస్తారు. రెండోరోజు ''పొంగల్'', మూడోరోజు ''మత్తు పొంగల్'', నాలుగోరోజు ''తిరువళ్ళువర్''. వీటిని మనం వరుసగా భోగి, పండుగ, కనుమ, ముక్కనుమ అంటాం.
బెంగాలీలకు సంక్రాంతి గొప్ప పండుగ. అత్యుత్సాహంతో వేడుక చేసుకుంటారు.
ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని ''ఖిచ్రి'' అంటారు. గంగా, యమునా, సరస్వతి సంగమ తీరంలో నదీ స్నానం చేస్తారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పంజాబులో భోగి పండుగను ''లోహ్రి'' అని, సంక్రాంతిని ''మఘీ'' అని అంటారు. ఈ పండుగ మహోత్సవం సందర్భంగా భాంగ్రా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ''సుకరాత్'' పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండివంటలు తయారుచేస్తారు.
makar sankranti all over india, Sankranti Celebrations in other states, Sankranti Festival Celebrations, makar sankranti in bengal, pongal in tamilnadu, sankranti festival celebrations, pongal festival in india, 3 days festival makar sankranti, bhogi panduga and kanuma
కాంతులు చిందించే సంక్రాంతి
Colourful Festival Sankranti
సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి Colourful Festival Sankranti విశేషాలు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలో సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.
మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోడానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది. 
అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.
భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.
ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.
ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. తిరుప్పావై పాశురాలను చదువుతారు లేదా వింటారు. వేద మంత్రాలను పఠిస్తారు. యాగాలు నిర్వహిస్తారు. ఇక హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తుండగానే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో అరిసెలు, పాలతాలలికలు చేసి దేవునికి నివేదిస్తారు. పేదసాదలకు దానధర్మాలు చేస్తారు. సాయంత్రంపూట బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.
Colourful Festival Pongal, hindu festival makar sankranti, colourful festival pongal, bhogi panduga and kanuma, makar sankranti and ariselu, makar sankranti and cock fight, makara sankranti and kolams
Makar Sankranti
Makara Sankranti is a Hindu festival celebrated in almost all parts of India and Nepal in a myriad of cultural forms. It is a harvest festival. It is the Hindi/Indo-Aryan languages name for Makara Sankranthi (still used in southern areas as the official name).
Makar Sankranti marks the transition of the Sun into the zodiac sign of Makara rashi (Capricorn) on its celestial path. The day is also believed to mark the arrival of spring in India and is a traditional event. Makara Sankranti is a solar event making one of the few Indian festivals which fall on the same date in the Gregorian calendar every year: 14 January, with some exceptions when the festival is celebrated on 13 or 15 January.


Makar Sankranti has an astrological significance, as the sun enters the Capricorn (Sanskrit: Makara) zodiac constellation on that day. This date remains almost constant with respect to the Gregorian calendar. However, precession of the Earth's axis (called ayanamsa) causes Makara Sankranti to move over the ages. A thousand years ago, Makara Sankranti was on 31 December and is now on 14 January. According to calculations, from 2050 Makar Sankranti will fall on 15 January.
Makara Sankranti is a major harvest festival celebrated in various parts of India. Makara Sankranti commemorates the beginning of the harvest season and cessation of the northeast monsoon in South India. The movement of the Sun from one zodiac sign into another is called Sankranti and as the Sun moves into the Capricorn zodiac known as Makara in Sanskrit, this occasion is named as Makara Sankranti in the Indian context. It is one of the few Hindu Indian festivals which are celebrated on a fixed date i.e. 14 January every year (or may be sometimes on 15 January (leap year)).
Makara Sankranti, apart from a harvest festival is also regarded as the beginning of an auspicious phase in Indian culture. It is said as the 'holy phase of transition'. It marks the end of an inauspicious phase which according to the Hindu calendar begins around mid-December. It is believed that any auspicious and sacred ritual can be sanctified in any Hindu family, this day onwards. Scientifically, this day marks the beginning of warmer and longer days compared to the nights. In other words, Sankranti marks the termination of winter season and beginning of a new harvest or spring season.
All over the country, Makara Sankranti is observed with great fanfare. However, it is celebrated with distinct names and rituals in different parts of the country. In the states of northern and western India, the festival is celebrated as the Sankranti day with special zeal and fervour. The importance of this day has been signified in the ancient epics like Mahabharata also. So, apart from socio-geographical importance, this day also holds a historical and religious significance. As it is the festival of Sun God, and he is regarded as the symbol divinity and wisdom, the festival also holds an eternal meaning to it.


Many Indians conflate this festival with the Winter Solstice, and believe that the sun ends its southward journey (Sanskrit: Dakshinayana) at the Tropic of Capricorn, and starts moving northward (Sanskrit: Uttarayaana) towards the Tropic of Cancer, in the month of Pausha on this day in mid-January.
There is no observance of Winter Solstice in the Hindu religion. Further, the Sun makes its northward journey on the day after winter solstice when day light increases. Therefore, Makara Sankranti signifies the celebration of the day following the day of winter solstice.
Scientifically, currently in the Northern Hemisphere, winter solstice occurs between December 21 and 22. Day light will begin to increase on 22 December and on this day, the Sun will begin its northward journey which marks Uttarayaana.[2] The date of winter solstice changes gradually due to the Axial precession of the Earth, coming earlier by approximately 1 day in every 70 years. Hence, if the Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, a date in mid-January would correspond to around 300CE.
Sankranti is celebrated all over South Asia with some regional variations. It is known by different names and celebrated with different customs in different parts of the country popularly celebrated in Karnataka (Sankranthi), Andhra pradesh (Sankranthi) and Tamil Nadu (Pongal).
In India it is known by different regional names.
Makara Sankranti: Chhattisgarh, Goa, Odisha, Haryana, Jharkhand, Andhra Pradesh, Karnataka, Kerala, Madhya Pradesh, Maharashtra, Manipur, Rajasthan, Sikkim, Uttar Pradesh, Uttarakhand, Bihar, telangana and West Bengal
Pongal: Tamil Nadu
Uttarayan: Gujarat
Maghi: Haryana, Himachal Pradesh and Punjab. The day before, people of Punjab celebrate Lohri.
Bhogali Bihu: Assam
Shishur Saenkraat: Kashmir Valley
Khichdi: Uttar Pradesh and western Bihar
Makara Sankramana: Karnataka
In other countries too the day is celebrated but under different names and in different ways.
Nepal: Maghe SankrantiTharu people,
Nepali Maithils, Newar :- Maghe Sankranti
Other people: Maghe Sankranti or Maghe Sakrati
Thailand: สงกรานต์ Songkran
Laos: Pi Ma Lao
Myanmar: Thingyan
Cambodia: Moha Sangkran
Sri Lanka: Pongal, Uzhavar Thirunal


The festival, Sankranti (మకర సంక్రాంతి), is celebrated for four days in Andhra Pradesh and Telengana as below:
Day 1 – Bhogi (భోగి)
Day 2 – Makara Sankranti (మకర సంక్రాంతి-పెద్ద పండుగ)- the main festival day
Day 3 – Kanuma (కనుమ)
Day 4 – Mukkanuma (ముక్కనుమ)
The day preceding Makara Sankranti is called Bhogi (భోగి) and this is when people discard old and derelict things and concentrate on new things causing change or transformation. At dawn people light a bonfire with logs of wood, other solid-fuels and wooden furniture at home that are no longer useful. The disposal of derelict things is where all old habits, vices, attachment to relations and material things are sacrificed in the sacrificial fire of the knowledge of Rudra, known as the "Rudra Gita Gyana Yagya". It represents realization, transformation and purification of the soul by imbibing and inculcating divine virtues.
In many families, infants and children (usually less than three years old) are showered with the Indian Jujube fruit Ziziphus mauritiana, called "Regi Pandlu" in Telugu. It is believed that doing this would protect the children from evil eye. Sweets in generous quantities are prepared and distributed. It is a time for families to congregate. Brothers pay special tribute to their married sisters by giving gifts as affirmation of their filial love. Landlords give gifts of food, clothes and money to their workforce.
The second day is Makara Sankranti. People wear new clothes, pray to God, and make offerings of traditional food to ancestors who have died. They also make beautiful and ornate drawings and patterns on the ground with chalk or flour, called "muggu" or "Rangoli" in Telugu, in front of their homes. These drawings are decorated with flowers, colours and small hand pressed piles of cow dung, called "gobbemma (గొబ్బెమ్మ)".
For this festival all families prepare Ariselu, Appalu (a sweet made of jaggery and rice flour) dappalam (a dish made with pumpkin and other vegetables) and make an offering to God.
On the day after Makara Sankranti, the animal kingdom is remembered and in particular, the cows. Young girls feed the animals, birds and fish as a symbol of sharing. Travel is considered to be inappropriate, as these days are dedicated for re-union of the families. Sankranti in this sense demonstrates their strong cultural values as well as a time for change and transformation. And finally, gurus seek out their devotees to bestow blessings on them.
On the third day, Kanuma (కనుమ) is celebrated. Nowadays Kanuma is not being celebrated widely as it used to be but is an integral part of the Sankranti culture.
Fourth day is called Mukkanuma (ముక్కనుమ) which is popular among the non-vegetarians of the society.
People in Coastal Andhra do not eat any meat or fish during the first three days of the festival, and do so only on the day of Mukkanuma. Another notable feature of the festival in Coastal Andhra Pradesh is the Haridasa who goes early in the morning around with a colorfully dressed cow, singing songs of Lord Vishnu (Hari) hence the name Haridasu (servant of Hari). It is a custom that he should not talk to anyone and only sing songs of lord vishnu when he goes to everyone's house. On this occasion, in every town and city, people play with kites and the sky can be seen filled with beautiful kites. Children and elders enjoy this kite flying occasion.