Search This Blog

Chodavaramnet Followers

Monday, 29 December 2014

PUNJABI SPECIAL SWEET PAROTA RECIPE IN TELUGU


స్వీట్ పరోఠా రిసిపి: పంజాబి స్పెషల్

కావల్సిన పదార్థాలు: 
గోధుమ పిండి: 2cups
నెయ్యి: 3-4tbsp 
ఉప్పు: రుచికి సరిపడా
ఫిల్లింగ్ కోసం:
పంచదార: 1cup
బాదం: 5
దాల్చిన చెక్క పొడి: 1/2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పంచదార వేసి మొత్తగా పొడి చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ ముద్దగా కలిపి పెట్టుకోవాలి.
3. అంతలోపు, పంచదార, బాదం, మరియు దాల్చిన చెక్క పొడిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత చపాతీ కర్రతో రోల్ చేయాలి. మద్యలో ఫిల్లింగ్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థంను మద్యలో పెట్టి నాలుగు వైపులా కవర్ చేసి తిరిగి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి స్వీట్ పరోటాలను వేసి రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ పరోటాలను వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.