హెల్దీ అండ్ ఈజీ ఓట్స్, బాదం దోసె
ఓట్స్, బాదం ఒబిసిటీని దూరం చేస్తాయి. వీటిలోని గుడ్ ఫ్యాట్, లో కెలోరీస్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఒకే రకమైన దోసె రిసిపిని తిని బోరుకొడుతుంటే, ఇలా వెరైటీగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. ఇది టేస్ట్ మాత్రమే కాకుండా హెల్దీగానూ ఉపయోగపడుతుంది.
కావల్సిన పదార్థాలు:-
బియ్యం పిండి: రెండు కప్పులు
పచ్చిమిర్చి తరుగు : మూడు స్పూన్లు
గోధుమ పిండి: రెండు కప్పులు
ఓట్స్ పౌడర్: రెండు కప్పులు
బాదం తురుము : అరకప్పు
పెప్పర్ పౌడర్: ఒక టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారీ విధానం:-
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, గోధుమపిండి, ఓట్స్ పౌడర్, పచ్చిమిర్చి, బాదం తురుము, పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు, నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయం పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె రాయాలి. తవా వేడయ్యాక గరిటతో పిండితీసుకొని దోసెలా పోసుకోవాలి. మీడియం మంటమీద రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే రుచికరమై ఓట్స్ దోసె రిసిపి రెడీ. దీనికి కొబ్బరి చట్నీ, సాంబార్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతేగాకుండా హెల్దీ కూడా.