కాల్షియం చాలా అవసరం
ఆరోగ్యకరమైన జీవనవిధానానికి, కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం అందరికీ మంచిది. ముఖ్యంగా మహిళలకు కాల్షియం అధికమోతాదులో తీసుకోవలసిన అవసరం ఉంది.
పాలు
పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా తప్పనిసరిగా పాలు తీసుకోవాలి. పాలల్లో ఉండే కాల్షియం సులభంగా అరుగుతుంది. శరీరం త్వరగా గ్రహిస్తుంది. పెరుగు
ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. ఒక కప్పు పెరుగులో దాదాపు 400 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. పాలు, పెరుగుతో పాటు ఛీజ్‌లో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది.
ఆకుకూరలు
కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలలో కాల్షియం అధికంగా ఉంటుంది.
బీన్స్
కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
మసాలా దినుసులు
వెల్లుల్లి, లవంగాలు, పుదీనాలలో కాల్షియం అధికంగా ఉంటుంది.
ఆరెంజెస్
పుల్లటి పళ్లలో విటమిన్ డినే కాక కాల్షియం అధికంగా ఉండటమే కాదు
పండుగా కాని, రసంగా కాని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది.