టీవీ రిమోట్
భార్యా భర్తలు ఐ.పీ.ఎల్ మ్యాచ్ చూస్తూన్నారు. అయిదు నిమిషాలయింది.
భార్య : " వాడు బ్రెట్ లీ కదూ "
భర్త : " కాదు ! వాడు క్రిస్ గైయిల్. బ్రెట్ లీ బౌలర్
భార్య : " అదిగో ఇంకో వికెట్ పడింది."
భర్త : " కాదు. అది రీ ప్లే "
భార్య : " ఇండియా గెలిచేటట్లు వుంది "
భర్త : " ఇది ముంబై కి బెంగుళూరు కి మద్య మ్యాచ్ "
భార్య : " ఇంకా ఎన్ని రన్సు చెయ్యాలి గెలవాలంటే "
భర్త : " 72 రన్స్ 36 బంతుల్లో "
భార్య : " అది చాలా ఈజీ , బంతికి రెండు రన్స్ "
భర్త టీవీ ఆపేశాడు.
భార్య టీవీ పెట్టి " తుంటరి పిల్ల - ఒంటరి పిల్లడు " 4006 ఏపిసోడ్ చూడటం మొదలు పెట్టింది.
భర్త : " ఆ అమ్మాయి ఎవరూ ? "
భార్య : " నన్ను ఓ గంట విసిగించకు "