Search This Blog

Chodavaramnet Followers

Monday 3 November 2014

Reflexology Chart and information in Telugu


పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology 
భారతీయ మహిళలు మెట్టెలు పెట్టుకునే సాంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు:
జాగ్రత్తగా గమనించండి.

మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి.

1. బొటన వేలు తలను..
2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...
3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి
4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...
5. అరికాలి లోని గుంట భాగం నడుమును
6. కాలి మడమ భాగం కాళ్ళను
7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...
ఇక విషయం చాలా వరకు మీకు అర్ధమయి ఉంటుంది...
బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..
తలకు మేలు చేకూరుతుంది...
ఇలా కాలిలోని ఒక్కొక్క భాగాన్ని మర్ధించడం ద్వారా వచ్చే ఫలితాలను బ్లాగు లో ఉంచాను...ఆసక్తి ఉన్న వారు బ్లాగు లింకును చూడండి.
గతంలో మన భారతీయ మహిళలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది...
అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్ళు పాయటం వంటి ఋగ్మతలకు లోనయ్యేవారు...
దీనికి విరుగుడుగా మెట్టెలు ధరించడం వలన కన్ను, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారించబడేవి...

కాలి మడమ ప్రాంతాలు మోకాళ్ళు, కాళ్ళు నొప్పులు రాకుండా నివారిస్తాయి... కాలి మడమల చివరి క్రింది భాగం దగ్గర మర్దనం పైల్స్ సమస్యలను నివారిస్తుంది... ఈ విధంగా కేవలం పది నిమిషాల పాద మర్ధన కార్యక్రమం ద్వారా మన శరీరంలోని ఎన్నో సమస్యలను నివారించ వచ్చు... అయ్యప్ప మాలలు,, మరికొన్ని దీక్షలలో స్వాములు పాదాలకు చెప్పులు వేసుకోకుండా నడవడమనే దాని వెనుక ఈ సదుద్దేశ్యమే ఉన్నది.. ఇది మన పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ..... ప్రయత్నించి చూడండి.