వ్యాధి నిరోధక శక్తికి బొప్పాయి రసం
ప్రతిరోజూ ఒక గ్లాసు బొప్పాయి రసాన్ని తాగితే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు, చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో చర్మానికి మేలు చేసే లక్షణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

బొప్పాయిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో వ్యాధి నిరోధకత పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్న చిన్న రుగ్మతలు దరిచేరవు. మొటిమల నివారణకు బొప్పాయి గుజ్జును ముఖంపై చర్మానికి ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. బొప్పాయిలోని పెపిన్ అనే ఎంజైమ్ చర్మంపై మృతకణాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.